యంగ్ హీరోల మధ్యా టిట్ ఫర్ టాట్
వరుణ్ ధావన్-కార్తీక్ ఆర్యన్ మధ్య పోటీని అభిమానులు ఇన్ సైడర్ వర్సెస్ ఔట్ సైడర్ పోటీగా చూస్తారు.;
వరుణ్ ధావన్-కార్తీక్ ఆర్యన్ మధ్య పోటీని అభిమానులు ఇన్ సైడర్ వర్సెస్ ఔట్ సైడర్ పోటీగా చూస్తారు. ఆ ఇద్దరి మధ్యా వివాదం ప్రధానంగా చర్చల్లోకొస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలలో ఇరువురిపైనా పెరుగుతున్న ట్రోలింగ్ వారి పబ్లిసిటీ బృందాల వల్లే జరుగుతోందని చాలామంది భావిస్తున్నారు.
ఆ ఇద్దరూ ఎవరికి వారు ఇండస్ట్రీలో నిలబెట్టుకునేందుకు చాలా పోరాటం సాగిస్తున్నారు. 2026లోను ఆ ఇద్దరి మధ్యా బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం ఈ యువహీరోలు తమ కెరీర్‌లో విభిన్నమైన దశల్లో ఉన్నారు. ఇటీవల విడుదలైన `తు మేరి మై తేరా మై తేరా తు మేరి` చిత్రం రొమాంటిక్ కామెడీ జానర్ లో వచ్చి ఫ్లాపైంది. అయితే అంతకుముందు వచ్చిన `భూల్ భులయ్యా 3` క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి కార్తీక్‌ను బాక్సాఫీస్ కింగ్‌గా నిలబెట్టింది.
వరుణ్ ధావన్ టించిన బేబి జాన్, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి చిత్రాలు ఫ్లాప్ షోలుగా మిగిలాయి. ప్రస్తుతం వరుణ్ సరైన హిట్లు లేక కెరీర్ ని నిలబెట్టుకోవడానికి చాలా పాట్లు పడుతున్నాడు. అయితే ఈ ఇద్దరి సినిమాలపైనా ఫ్యాన్స్ మీమ్స్ కామెంట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. కార్తీక్ నటించిన `తూ మేరి ..` ఫ్లాపవ్వడంతో ప్రత్యర్థి బృందాలు అతడిని టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నాయి. అదే సమయంలో ధావన్ నటించిన ఫ్లాపుల్ని చూసి మీమ్స్ ని వైరల్ చేస్తున్నారు కార్తీక్ ఆర్యన్ అభిమానులు. ఇటీవల విడుదలైన బార్డర్ 2 లో ధావన్ బోయ్ ఎక్స్ ప్రెషన్స్ పై చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సినిమాపై బజ్ తగ్గించేందుకు ప్రత్యర్థుల ప్రయత్నమిదని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం పీఆర్ జిమ్మిక్కులు అంటూ ఒక సెక్షన్ వాదిస్తోంది.
ఆ ఇద్దరి మధ్యా పోటీని పెంచేందుకు ఇన్ సైడర్ - ఔట్ సైడర్ డిబేట్ ని కొందరు తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి సమయంలో 2026లో వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
కార్తీక్ ప్రస్తుతం ఫాంటసీ అడ్వెంచర్ నాగ్ జిల్లా చిత్రంల నటిస్తుండగా, బోర్డర్ 2 లో వరుణ్ మేజర్ హోషియార్ సింగ్‌గా నటిస్తున్నారు. ఆగస్టు లో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే కార్తీక్ భూల్ భులయ్యా 4, ధావన్ భేడియా 2 పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఫ్యాన్స్ మధ్యా వార్ పీక్స్ కి చేరుకుంటోంది.