పవన్ 'ఉస్తాద్'.. అసలు క్లారిటీ వచ్చేదెప్పుడు?
రీసెంట్ గా ఆయన ఇచ్చిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో కూడా రీమేక్ కాదని మరోసారి చెప్పారు.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సమ్మర్ కానుకగా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. నిజానికి మార్చి 26వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. కానీ రీసెంట్ గా ప్రీ పోన్ చేసి.. మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. నిజానికి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి మూవీ రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్ మాత్రం ఇప్పటికే దాన్ని పలు సందర్భాల్లో ఖండించారు. సినిమా కంప్లీట్ ఒరిజినల్ స్క్రిప్ట్ తో రూపొందుతోందని తెలిపారు.
రీసెంట్ గా ఆయన ఇచ్చిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో కూడా రీమేక్ కాదని మరోసారి చెప్పారు. ఒకవేళ అయితే తాను కథ, మాటలు, దర్శకత్వం అనే కార్డ్ ఎందుకు వేసుకుంటానని క్వశ్చన్ చేశారు. పోలీస్ కథలు ఒకేలా కనిపించడం కామన్ అని చెప్పారు. దీంతో చాలా మంది ఉస్తాద్.. తేరి రీమేక్ కాదని ఫిక్స్ అయ్యారు. కానీ ఇంతలో బుక్ మై షో ఇచ్చిన సినాప్సిస్ రీమేక్ వార్తలకు బలాన్నిచ్చింది.
ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన కూతురితో సాధారణ జీవితాన్ని గడుపుతుంటారని, కానీ కొందరు ఇబ్బంది పెట్టడంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతారని బుక్ మై షో రాసుకొచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు మళ్లీ బయటకు వచ్చి, ఫ్యామిలీ మొత్తంలో మిగిలి తనన కూతురిని రక్షించేందుకు పోరాడుతారని చెప్పింది. దీంతో ఇది తేరి మూవీ స్టోరీ లైనేనని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
అంతే కాదు చాలా మంది హరీష్ శంకర్ ను ట్రోల్ చేశారు. అదే సమయంలో బుక్ మై షో సినాప్సిస్ ఛేంజ్ చేసింది. ఓ గిరిజన బాలుడు స్టోరీ సినిమాగా చెప్పింది. అన్యాయానికి ఎప్పుడూ తలొగ్గడని, ఎలాంటి పరిస్థితిలో అయినా స్ట్రాంగ్ గా ఆ యువకుడు ఉంటాడని చెప్పింది. నిజాయితీ, ధర్మం, లక్ష్యంతో పోరాడే ఒక మనిషి కథగా చెప్పింది. దీంతో ఇప్పుడు నెటిజన్లు మళ్లీ డిస్కస్ చేసుకుంటున్నారు. వెంట వెంటనే సినాప్సిస్ ఎందుకు మార్చిందోనని మాట్లాడుకుంటున్నారు.
కొందరు మేకర్స్ కాల్ చేసి క్లారిటీ ఇచ్చారేమో.. అందుకే మార్చిందని, బుక్ మై షోదే తప్పు అని అంటున్నారు. మరికొందరు మాత్రం ట్రోల్స్ కు భయపడి మార్చిందని చెబుతున్నారు. ఇంకొందరు.. అసలు స్టోరీ లైన్ ఏంటో అర్థం కావడం లేదని అంటున్నారు. అందుకే సరైన గ్లింప్స్ లేదా టీజర్ ను రిలీజ్ చేసి అన్నింటికీ చెక్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అసలు ఉస్తాద్.. తేరి రీమేక్ అవునో కాదో అనేది గ్లింప్స్ తోనే క్లారిటీ ఇస్తే బెటర్ అని చెప్పాలి. మరి మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.