శిఖరాగ్రాన ఉన్నప్పుడే వెండితెరకు గుడ్‌బై!

కానీ కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడే ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ అనుభవిస్తున్న సమయంలోనే వెండితెరకు పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకునే వారు చాలా అరుదుగా ఉంటారు.

Update: 2026-06-07 18:30 GMT

నటీనటులు దశాబ్దాల తరబడి స్టార్‌డమ్‌ను కాపాడుకోవడానికి ఎంతో ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడే ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ అనుభవిస్తున్న సమయంలోనే వెండితెరకు పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఓ అరుదైన నిర్ణయంతో వార్తల్లో నిలిచిన నటి ఆసిన్. బాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్ అనే పదం సాధారణ చర్చల్లోకి రాకముందే అసిన్ ఆ మైలురాయిని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. టీనేజర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆసిన్ హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టడానికి ముందే దక్షిణాదిలోని బహుళ పరిశ్రమలలో అగ్ర కథానాయికగా తన ముద్ర వేశారు.

అటుపై బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ సరసన నటించిన `గజినీ` చిత్రం తో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ చిత్రంలో అసిన్ పోషించిన కల్పన పాత్ర ప్రేక్షకుల హృదయాలకు ద‌గ్గ‌రైంది. ఆమె పాత్ర‌ సినిమాకు ఎమోషనల్ హార్ట్ బీట్‌గా నిలిచింది. ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మైలురాయిని దాటిన మొట్టమొదటి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఆర‌కంగా బాలీవుడ్ వాణిజ్య ప్రమాణాలను పూర్తిగా మార్చేసిన తొలి చిత్ర్గా నిలిచింది. ఆ విజ‌యంతో ఆసిన్ బాలీవుడ్ అగ్ర హీరోలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. సల్మాన్ ఖాన్‌తో `రెడీ`, అక్షయ్ కుమార్‌తో `హౌస్‌ఫుల్ 2`, `ఖిలాడీ 786`, అజయ్ దేవగన్‌తో `బోల్ బచ్చన్` వంటి వరుస కమర్షియల్ హిట్లతో బాక్సాఫీస్‌ను శాసించారు.

మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రాణించారు. కానీ మిగిలిన నటీమణులలాగా వివాహం తర్వాత కూడా ఏదో ఒక రకంగా బాలీవుడ్ సర్కిల్స్‌లో కొనసాగాలని అసిన్ అనుకోలేదు. 30 ఏళ్ల వయసులోనే కెమెరాకు శాశ్వతంగా దూరమయ్యారు. 2016 లో మైక్రోమాక్స్ కో-ఫౌండర్ .. పారిశ్రామికవేత్త రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఇద్ద‌రి పరిచయానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మధ్యవర్తిగా వ్యవహరించడం విశేషం. 2015లో రిలీజ్ అయిన `ఆల్ ఈజ్ వెల్` చిత్రం తర్వాత ఆసిన్ పూర్తిగా కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయించారు.

2017లో ఈ దంపతులకు కుమార్తె అరిన్ రైన్ జ‌న్మించిన తర్వాత అసిన్ సోషల్ మీడియాకు -పబ్లిక్ లైఫ్‌కు మరింత దూరంగా జరిగిపోయారు. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విష‌యాల‌ను మాత్రమే అప్పుడప్పుడు పంచుకుంటున్నారు. మునుపటి గ్లామర్ ప్రపంచానికి భిన్నంగా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. జనవరి 2026 నాటికి ఈ జంట పదేళ్ల విజయవంతమైన వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకుంది. ఆసిన్ చివరి చిత్రంలో కనిపించి దశాబ్ద కాలం దాటిపోయినప్పటికీ ఆమె మళ్లీ వెండితెరపైకి వస్తారా? లేదా? అనే కుతూహలం ఇప్పటికీ ప్రేక్షకుల్లో సజీవంగానే ఉంది.

అయితే లైమ్‌లైట్ వెలుపల ఆమె లీడ్ చేస్తున్న ప్రైవేట్ లైఫ్‌ను గమనిస్తే అసిన్ ప్రస్తుత జీవితంతో ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్‌డమ్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు వైదొలిగి తన జీవితానికి పూర్తిగా భిన్నమైన ముగింపు అధ్యాయాన్ని రాసుకున్న ఆసిన్చి చిత్రసీమలో ఎప్పటికీ మరపురానిదే.

Tags:    

Similar News