• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెద్ది స్టెప్‌తో మరోసారి...

పెద్ది స్టెప్‌తో మరోసారి వైరల్.. కెవిన్ క్రేజ్ మామూలుగా లేదుగా!

| ఒకప్పుడు సినీ తారల వెంట కనిపించే బాడీగార్డులు కేవలం భద్రతా సిబ్బందిగానే గుర్తింపు పొందేవారు.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-06-07 13:37 GMT

ఒకప్పుడు సినీ తారల వెంట కనిపించే బాడీగార్డులు కేవలం భద్రతా సిబ్బందిగానే గుర్తింపు పొందేవారు. కానీ సోషల్ మీడియా యుగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు వారి బాడీగార్డులు కూడా ప్రత్యేక గుర్తింపు, అభిమాన వర్గాన్ని సంపాదించుకుంటున్నారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప‌ర్స‌న‌ల్ బాడీగార్డ్ కెవిన్ కుంట పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రావడం ఈ మార్పుకు నిదర్శనంగా నిలిచింది. రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా పెద్దిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యాట్ సిగ్నేచర్ మూమెంట్‌ను కెవిన్ రీక్రియేట్ చేసిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చరణ్ బాడీగార్డ్ మాత్ర‌మే కాదు, సోషల్ మీడియా స్టార్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి కెవిన్ వైర‌ల్ అవ‌డం ఇదేమీ మొద‌టిసారి కాదు. రామ్ చరణ్‌తో పలు ఈవెంట్లు, ఎయిర్‌పోర్ట్ దర్శనాలు, అభిమానుల మధ్య జరిగిన సందర్భాల్లో ఆయన ప్రొఫెషనల్ ప్రవర్తన, ఫిట్‌నెస్, స్టార్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఇప్పటికే మంచి గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో కెవిన్‌కు స్పెషల్ ఫ్యాన్ పేజీలు కూడా ఉండటం విశేషం. ఇప్పుడు పెద్దిలోని సిగ్నేచర్ స్టెప్‌ను తనదైన శైలిలో చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించిన చికిరి చికిరి సాంగ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఆ పాటకు సంబంధించిన డ్యాన్స్ మూమెంట్లు, రీల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉండ‌గా, కెవిన్ తాజా వీడియో కూడా ఆ జోరును మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సెలబ్రిటీ బాడీగార్డులు స్టార్‌డమ్ పొందడం కొత్త విషయం కాకపోయినా, గత కొన్నేళ్లుగా ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా ఇప్పటికే సెలబ్రిటీ హోదా సంపాదించుకున్నారు. ఆయనకు స్పెష‌ల్ ఫ్యాన్స్, సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రమే కాదు, స్పెష‌ల్ బ్రాండ్ వాల్యూ కూడా ఏర్పడింది. అదే తరహాలో సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో పరిశ్రమలో కెవిన్ వంటి వ్యక్తులు ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. హీరోలతో రెగ్యుల‌ర్ గా కనిపించడం, వారి జీవితాల్లో కీలక పాత్ర పోషించడం, సోషల్ మీడియాలో వారి ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం వంటి అంశాలు ఈ గుర్తింపుకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు కెమెరా ఫ్రేమ్‌లో కనిపించకుండా ఉండే వ్యక్తులు, ఇప్పుడు నెటిజన్ల చర్చల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుండటం ఆసక్తికర పరిణామంగా మారింది.

సోషల్ మీడియా ప్రభావంతో సెలబ్రిటీల చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రజల దృష్టిలోకి వస్తున్న ఈ కాలంలో, కెవిన్ తాజా వైరల్ వీడియో మరో ఉదాహరణగా నిలిచింది. పెద్ది సినిమా సృష్టించిన క‌ల్చ‌ర‌ల్ ఎఫెక్ట్ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ఆ సినిమా ద్వారా పరోక్షంగా కెవిన్ వంటి వ్యక్తుల క్రేజ్ కూడా పెరుగుతోంది. స్టార్ హీరోలకే పరిమితమైన అభిమాన ప్రపంచం ఇప్పుడు వారి సన్నిహిత సిబ్బంది వరకు విస్తరించిందని చెప్పడానికి ఈ సంఘటన చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.



Tags:    
  • ramcharan 
  • peddi 
  • kevinkunta 
  • megapowerstar 
  • peddimovie 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS