సమంత, సాయి పల్లవి కలిస్తే.. ఒక్క రిప్లై తోనే ఫుల్ హైప్!
స్టార్ హీరోయిన్లు సమంత, సాయి పల్లవి కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.
స్టార్ హీరోయిన్లు సమంత, సాయి పల్లవి కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ సందర్భంగా జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. సామ్ లీడ్ రోల్ లో నటించి నిర్మించిన మా ఇంటి బంగారం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ ను ఇప్పటికే స్టార్ట్ చేసింది.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా సమంత రీసెంట్ గా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో సినిమా కథ గురించి మాట్లాడుతూ.. అసలు మా ఇంటి బంగారం స్టోరీ మొదట సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని రాశారని చెప్పారు. దర్శకురాలు నందినీ రెడ్డి కూడా ముందుగా సాయి పల్లవితో ఆ ప్రాజెక్ట్ చేయాలని భావించారట. కానీ ఆ సమయంలో సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో రిజెక్ట్ చేశారని సమంత తెలిపారు.
ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేసి తనకు తగ్గట్టు రూపొందించారని చెప్పారు. ‘'ఈ సినిమాను నేను సెలెక్ట్ చేసుకోలేదు.. సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది' అంటూ సామ్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. అదే వీడియోను చూసిన సాయి పల్లవి వెంటనే రెస్పాండ్ అయ్యారు. సమంత ఇన్ స్టా స్టోరీని షేర్ చేస్తూ.. 'ఈ సినిమా సమంత చేయాల్సినదే. ఆమెకే బాగా సరిపోతుంది. సమంతకు, నందినీ రెడ్డికి నా విషెస్’' అంటూ రాసుకొచ్చారు.
అయితే ఆమె పోస్ట్ చివర్లో 'అవును.. త్వరలో' అంటూ ఇచ్చిన చిన్న మెసేజ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఒక్క మాటతో కొత్త చర్చ మొదలైంది. సమంత, సాయి పల్లవి కలిసి ఏదైనా కొత్త సినిమా చేయబోతున్నారా? లేక మరో ప్రాజెక్ట్ గురించి ఇద్దరూ ఇప్పటికే మాట్లాడుకున్నారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. దీనిపై ఇద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి సమంత, సాయి పల్లవి ఇద్దరూ యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటారు. కమర్షియల్ సినిమాలతో పాటు కథకు ఇంపార్టెన్స్ ఉన్న చిత్రాల్లో కూడా తమదైన ముద్ర వేశారు. అందుకే వీరిద్దరూ కలిసి నటిస్తే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పక్కా అంటున్నారు సినీ ప్రియులు. మరోవైపు సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ కూడా ఉమెన్ ఓరియెంటెడ్ స్టోరీలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది.
దీంతో ఫ్యూచర్ లో సాయి పల్లవితో కలిసి ఏదైనా సినిమా చేసే అవకాశం ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతం అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదీ లేదు. కానీ సాయి పల్లవి చేసిన చిన్న కామెంట్ మాత్రం పెద్ద చర్చకు కారణమైంది. ఫుల్ హైప్ కూడా క్రియేట్ చేసింది. ఒకవేళ ఫ్యూచర్లో సమంత, సాయి పల్లవి కలిసి స్క్రీన్ పై కనిపిస్తే.. అది స్పెషల్ కాంబినేషన్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.