• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండస్ట్రీ 'పవర్ గ్రూప్స్'...

ఇండస్ట్రీ 'పవర్ గ్రూప్స్' గుట్టు రట్టు చేసిన నటి!

| పరిశ్రమలో కార్మికుల హక్కులను కాపాడాల్సిన యూనియన్ నాయకులే, నటీనటుల , సాంకేతిక నిపుణుల ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని శ్రీలేఖ మిత్ర విమర్శించారు.

By - Srikanth Kontham
Update: 2026-06-07 13:30 GMT

సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపులు.. పవర్‌ గ్రూపుల ఆధిపత్యంపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత పలు పరిశ్రమల్లోని మహిళా నటీమణులు తమకు జరిగిన అన్యాయాలపై గొంతు విప్పుతున్నారు. ఈ క్రమంలోనే బెంగాలీ సినీ పరిశ్ర మకు చెందిన నటి శ్రీలేఖ మిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా రంగంలో పవర్‌ఫుల్ వ్యక్తుల ఒత్తిళ్లకు .. అన్యాయాలకు లొంగని వారిని ఏ విధంగా పక్కన పెడతారో? శ్రీలేఖ మిత్ర తన వ్యక్తిగత అనుభ‌వం ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు.

పరిశ్రమలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తుల వల్ల తాను దాదాపు పదేళ్ల పాటు పరోక్షంగా నిషేధానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తన నటనపై ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ లొంగిపోని నైజం వల్లే తనకు రావాల్సిన అవకాశాలను కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఫెడరేషన్ ఆఫ్ సినీ టెక్నీషి యన్స్ అండ్ వర్కర్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అధ్యక్షుడు స్వరూప్ బిస్వాస్ అరెస్ట్ కావడంపై శ్రీలేఖ మిత్ర స్పందించారు. టెక్నీషియన్ల యూనియన్‌లో జరుగుతోన్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం , వేధింపుల ఆరోపణల నేపథ్యంలో స్వరూప్ బిస్వాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామంపై స్పందిస్తూ పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న ఇలాంటి పవర్‌ గ్రూపుల ఆట కట్టించడానికి ఇదొక మంచి ఆరంభమని అభిప్రాయపడ్డారు.

పరిశ్రమలో కార్మికుల హక్కులను కాపాడాల్సిన యూనియన్ నాయకులే, నటీనటుల , సాంకేతిక నిపుణుల ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని శ్రీలేఖ మిత్ర విమర్శించారు. ఎవరైనా తమకు ఎదురు తిరిగితే వారికి పని దక్క కుండా చేయడం, పరిశ్రమ నుండి బహిష్కరించడం వంటి బెదిరింపులకు పాల్పడే సంస్కృతి ఇక్కడ బలంగా నాటుకుపోయిందని మండిపడ్డారు. స్వరూప్ బిస్వాస్ అరెస్ట్ అనేది వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్లును శుభ్రం చేయడానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ అరెస్ట్ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాకూడదని పరిశ్రమలో ఇంకా ఎంతోమంది ఇలాంటి లబ్ధిదారులు, వేధింపులకు గురిచేసే పవర్‌ఫుల్ వ్యక్తులు ఉన్నారని శ్రీలేఖ గుర్తుచేశారు.

బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు. చలనచిత్ర రంగం అనేది కొద్దిమంది సొత్తు కాదని, ప్రతి ఒక్కరికీ ఇక్కడ స్వేచ్ఛగా, గౌరవప్రదంగా పనిచేసే వాతావరణం ఉండాలన్నారు. శ్రీలేఖ మిత్ర చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ సినీ పరిశ్రమల్లో అంతర్గతంగా సాగుతున్న మాఫియా తరహా పోకడలను ఎండగడుతున్నాయి. పదేళ్ల పాటు కెరీర్‌ను కోల్పోయినప్పటికీ ఆమె ధైర్యంగా గొంతు విప్పడంతో చిత్రసీమలో మార్పు కోరుకునే ఎంతోమందికి కొత్త ధైర్యాన్ని ఇచ్చినట్లయింది. భవిష్యత్తులో ఈ అరెస్టులు ..విచారణలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Tags:    
  • srelekhamitra 
  • bengalicinema 
  • filmindustry 
  • womeninsinema 
  • hemacommittee 

Similar News

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS