పోటీకి భ‌య‌ప‌డ‌ట్లేదు.. ఆయ‌న వ‌ల్లే సినిమా లేట‌వుతోంది

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీలో సినిమా రిలీజుల‌కు పోటీ ఎక్కువైపోతుంది. ఒక‌ప్పుడు వారానికి ఒక‌టి లేదా రెండు సినిమాలు మాత్ర‌మే రిలీజ‌య్యేవి కానీ ఇప్పుడు ఎంత‌లేద‌న్నా వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ‌వుతున్నాయి.;

Update: 2026-01-11 09:30 GMT

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీలో సినిమా రిలీజుల‌కు పోటీ ఎక్కువైపోతుంది. ఒక‌ప్పుడు వారానికి ఒక‌టి లేదా రెండు సినిమాలు మాత్ర‌మే రిలీజ‌య్యేవి కానీ ఇప్పుడు ఎంత‌లేద‌న్నా వారానికి నాలుగైదు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా పోటీ ఎక్కువైపోయింది. ఈ ఎఫెక్ట్ కొన్ని సినిమాల‌పై ప‌డ‌టం, ఆ పోటీ వ‌ల్ల మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద స‌రిగా పెర్ఫార్మ్ చేయ‌లేని సంద‌ర్భాలెన్నో ఉన్నాయి.

వాయిదా ప‌డ్డ అవారాప‌న్2

ఏప్రిల్ లో బాలీవుడ్ లో అలాంటి భారీ బాక్సాఫీస్ పోటీ ఒక‌టి జ‌ర‌గ‌బోతోంది. ఈ పోటీలో ఎన్నో సినిమాలు పోటీ ప‌డ‌నుండ‌గా, ఆ పోటీ నుంచి ఇప్పుడో సినిమా నెమ్మ‌దిగా త‌ప్పుకుంటున్న తెలుస్తోంది. వాటిలో అవారాప‌న్2 ఒక‌టి. ముందు అనుకున్న ప్ర‌కార‌మైతే ఈ సినిమా భారీ పోటీలో రిలీజ్ అవాలి. ఏప్రిల్ 13న అవారాప‌న్2 సినిమాను ఆడియ‌న్స్ ముందుకు తీసుకురానున్న‌ట్టు మేక‌ర్స్ భావించారు.

మే లేదా జూన్ లో అవారాప‌న్2 రిలీజ్

కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా ప‌డింద‌ని, దురంధ‌ర్2, టాక్సిక్ సినిమాలు కూడా అదే స‌మ‌యంలో రిలీజ‌వుతుండ‌టం వ‌ల్ల ఆ పోటీని త‌ట్టుకోవ‌డం ఎందుక‌ని మేక‌ర్స్ అవారాప‌న్2 ను పోస్ట్ పోన్ చేస్తున్నార‌ని వార్త‌లొచ్చాయి. అయితే ఈ విష‌యంలో చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అవారాప‌న్2 మే లేదా జూన్ లో రిలీజ‌వుతుంద‌ని తెలిపారు.

పోటీ వార్త‌ల‌ను ఖండించిన నిర్మాత‌

అవారాప‌న్2 పోస్ట్ పోన్ అవ‌డానికి దురంధర్2, టాక్సిక్ సినిమాల పోటీనే కార‌ణ‌మ‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను కూడా ఆయ‌న ఖండించారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ‌డానికి కార‌ణం ఇమ్రాన్ హ‌ష్మీ అని, షూటింగ్ టైమ్ లో ఆయ‌నకు ప్ర‌మాదం జ‌ర‌గ‌డం వ‌ల్లే ఈ సినిమా రిలీజ్ లేట‌వుతుంద‌ని, ఆ యాక్సిడెంట్ వ‌ల్ల ఇమ్రాన్ హ‌ష్మీకి స‌ర్జ‌రీ చేయాల్సి రావ‌డంతో షూటింగ్ షెడ్యూల్ ఆల‌స్య‌మైన‌ట్టు ఆయ‌న చెప్పారు.

45 రోజుల పాటూ యాక్ష‌న్ సీన్స్ లో పార్టిసిపేట్ చేయొద్ద‌ని డాక్ట‌ర్లు ఇమ్రాన్ హ‌ష్మీకి స‌ల‌హా ఇచ్చార‌ని, ఈ రీజ‌న్ తోనే మిగిలిన యాక్ష‌న్ సీన్స్ ను వాయిదా వేశామ‌ని, దీంతో సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అవుతున్న‌ట్టు చెప్పారు. ఇక దురంధ‌ర్2, టాక్సిక్ సినిమాల‌తో పోటీ గురించి మాట్లాడుతూ, పోటీ విష‌యంలో తానెప్పుడూ ఆందోళన చెంద‌డం లేద‌ని, దురంధ‌ర్2, టాక్సిక్ సినిమాల‌కు తాను భ‌య‌ప‌డ‌టం లేద‌ని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రో షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంద‌ని, ఆ షెడ్యూల్ లో సినిమాలోని కీల‌క యాక్ష‌న్ సీన్స్ ను మ‌లేషియాలో 20 రోజుల పాటూ షూట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ముకేష్ భ‌ట్ చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తుంటే ఇమ్రాన్ హ‌ష్మీ పూర్తిగా కోలుకున్న త‌ర్వాతే షూటింగ్ తిరిగి మొద‌ల‌వ‌నున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఏదేమైనా అవారాప‌న్2 పోస్ట్ పోన్ ను మాత్రం ఆడియ‌న్స్ మంచి మూవ్ లాగానే భావిస్తున్నారు.

Tags:    

Similar News