నితిన్ సైలెంట్ గా కాన్సంట్రేట్ చేశారా?

వరుస సినిమాలు చేస్తున్నా రిజల్ట్ మాత్రం ఫ్లాపులే.. హిట్ కోసం ఎదురు చూస్తూ ఏళ్లే గడిచిపోయాయి.;

Update: 2026-03-04 07:02 GMT

వరుస సినిమాలు చేస్తున్నా రిజల్ట్ మాత్రం ఫ్లాపులే.. హిట్ కోసం ఎదురు చూస్తూ ఏళ్లే గడిచిపోయాయి. అందుకే ఇప్పుడు పూర్తి ఫోకస్ వర్క్ పైనే పెట్టేశారట టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఒకప్పుడు మంచి చిత్రాలతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో కెరీర్ స్టార్టింగ్ నుంచే ఇతర ఈవెంట్స్, ఫంక్షన్లలో పెద్దగా కనిపించని ఆయన.. ఇప్పుడు అయితే అస్సలు లైమ్‌ లైట్‌ లోకి రావడం లేదు.

మీడియా హడావుడి కంటే షూటింగ్ సెట్లకే పరిమితమై, సైలెంట్‌ గా తన అప్ కమింగ్ సినిమాల కోసం కష్టపడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలతో మంచి జోష్‌ లో ఉన్న నితిన్‌ కు భీష్మ తర్వాత ఆ స్థాయి బ్లాక్‌ బస్టర్ మాత్రం దక్కలేదు. మధ్యలో పలు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కెరీర్ గ్రాఫ్ కొంత తగ్గింది.

ముఖ్యంగా ఇటీవల వచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అవి కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. దీంతో ఇకపై కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలని నితిన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బ్యాక్ టూ బ్యాక్ కొత్త ప్రాజెక్టులకు కమిట్ కావడం ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా తన 36వ చిత్రాన్ని ప్రకటించారు.

ఆ సినిమాకు వర్సటైల్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఆ చిత్రం సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్‌ గా రూపొందనుందని సమాచారం. కొత్త కథనం, కొత్త విజువల్స్‌ తో ప్రేక్షకులకు విభిన్న అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో టీమ్ పనిచేస్తోంది. సినిమాలో నితిన్ పాత్ర కూడా స్పెషల్‌ గా ఉండబోతుందట.

అన్నదమ్ముల కథాంశంతో తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఆయన డ్యూయల్ చేయనున్నారని టాక్. గతంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి బుల్లోడులో డబుల్ రోల్ చేసిన నితిన్, చాలా కాలం తర్వాత మళ్లీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇక మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో ఆయ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అంజి కె. మణిపుత్ర చెప్పిన కథకు కూడా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఆ ప్రాజెక్ట్‌ ను తన సొంత సంస్థ శ్రేష్ఠ మూవీస్ పై నిర్మించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా నితిన్ ఇప్పుడు పబ్లిసిటీకి దూరంగా, కంటెంట్‌ కు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. బయట కనిపించకపోయినా, సెట్స్‌ పై మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. సైలెంట్‌ గా కాన్సంట్రేట్ చేస్తున్నారు. మరి హార్డ్ వర్క్ ఆయనకు గట్టి కంబ్యాక్ తీసుకువస్తుందా అన్నది వేచి చూడాలి. అభిమానులు మాత్రం మరో సాలిడ్ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరేం జరుగుతుందో..

Tags:    

Similar News