మంగ్లీ పాటకు మెగాస్టార్ సపోర్ట్..!

Update: 2021-04-02 16:30 GMT
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హీరోలుగాని లేదా యూట్యూబ్ స్టార్స్ గాని ఎవరు హెల్ప్ అడిగినా కాదనకుండా చేయందిస్తారు. అప్పుడప్పుడు మెగాహీరోలు కాకుండా బయటివారి సినిమాలకు, పాటలకు ఆయన సపోర్ట్ అందిస్తుంటారు. ఇండస్ట్రీలో అందరికి సాయం చేసే మెగాస్టార్ ఓ టాలెంటెడ్ సింగర్ పాటకు మద్దతుగా నిలిచారు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి సింగర్ గా పాపులర్ అయింది గిరిజన బిడ్డ మంగ్లీ. ఆమె పాట ప్రస్తుతం అందరినోటా మాములే అయిపోయింది. ఎందుకంటే ఓవైపు జానపద పాటలు పాడుతూనే మరోవైపు సినిమా పాటలతో సంగీత ప్రియులను అలరిస్తుంది. ఇటీవలే మంగ్లీ పాడిన సినిమా పాటలు ఓ రేంజిలో మోత మోగించాయి.

క్రాక్ సినిమాలో బూమ్ బద్దలు సాంగ్, అల్లుడు అదుర్స్ మూవీలో 'రంభ ఊర్వశి మేనక', చావుకబురు చల్లగా సినిమాలో మరో స్పెషల్ సాంగ్ పాడి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో మాస్ పెప్పి సాంగ్స్ అంటే మంగ్లీ వైపు చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. తాజాగా మంగ్లీ 'యోగితత్వం' అనే పాటను ఆలపించింది. ఆ భక్తి పాటను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించింది మంగ్లీ. ఆమె పేరుమీద ఉన్న ఆఫీసియల్ యూట్యూబ్ ఛానల్లో ఈ యోగితత్వం అనే సాంగ్ రిలీజ్ చేశారు మెగాస్టార్. ప్రముఖ సంకిర్తనాచార్యులు మల్కిదాస్ గారి తత్త్వసంకీర్తన నుండి ఈ పాటను సేకరించారు. 'నా గురుడు నన్నింకా యోగి గమ్మననే' అంటూ సాగే ఈ పాటకు మెగాస్టార్ సపోర్ట్ చేయడంతో ప్రేక్షకుల దృష్టి ఈ పాట పై పడింది. ఈ పాటకు బాజీ సంగీతం అందించగా.. దామురెడ్డి దర్శకత్వం వహించాడు.
Tags:    

Similar News