ఫోటో స్టోరి: ఎవరండీ ఈ చెడ్డీ స్టార్ గుర్తు పట్టరూ..!
స్టార్ డమ్ అంటే నామోషీ కాదు.. నేను నిక్కరు వేయలేకే దర్శకుడిని అయ్యాను అని ఒక స్టార్ డైరెక్టర్ ఇటీవల అన్నారు. కానీ స్టార్ అయ్యేవాళ్లు అలా కాదు. నిక్కరు వేసేందుకైనా లేదా లుంగీ డ్యాన్సుకైనా... చీరకట్టి హిజ్రాలా కనిపించేందుకైనా.. దేనికైనా సై అనేసేవారే స్టార్లు..గా ఏల్తారు.
ఎన్టీఆర్.. ఏఎన్నార్ సైతం ఎన్నో ప్రయోగాలు చేశారు. ఏఎన్నార్ స్టేజీ డ్రామాల్లో ఆడ వేషాలు వేశాకే హీరో అయ్యింది. ఎన్టీఆర్ సైతం ఆడ వేషం వేసారు. ఆ తర్వాత చాలా మంది హీరోలు ఎన్నో ప్రయోగాలు చేశారు.
ఆ తర్వాత కూడా 90 వ దశకంలో అప్పటి హీరోల స్టైలిష్ ఐకాన్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు అప్పటి ట్రెండ్ ఆ తర్వాతి కాలంలోనూ ఆచరణలోకి వచ్చింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 90 వ దశకంలో ఓ సినిమా కోసం ధరించిన స్కిన్ టైట్ నిక్కర్ ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఆయన చెడ్డీ.. టీషర్ట్..గోల్డ్ కలర్ రేబాన్ కళ్లద్దాల ఫోటో చర్చకు దారి తీసింది. ఆన్ సెట్స్ లో ఉన్న మెగాస్టార్ పాత లుక్ ఒకట ప్పుడు వైరల్ గా మారింది. షూటింగ్ లో భాగంగా కొంత మంది మెగా అభిమానులు ఆయన్ని కలిసి ఫోటో దిగినట్లు దీనిని బట్టి తెలుస్తోంది. ఇది చిరంజీవి యువకుడిగా ఉన్నప్పటి ఫోటో. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి ఎవ్వర్ గ్రీన్ లుక్ గురించి ఆసక్తికర డిబేట్ నడుస్తోందిపుడు. 90వ దశకంలో ఇంకా చాలా మంది హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేశారు.
చిరంజీవి సమకాలికులు బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున ఎన్నో ప్రయోగాత్మక లుక్ లలో కనిపించి మెప్పించారు. ఇక చిరంజీవి కెరీర్ లో మాస్ లుక్ కోసం ఎన్నో ప్రయోగాలు చేసారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాస్ కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`లో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అలాగే మలయాళ సినిమా `లూసీఫర్` రీమేక్ చిత్రానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
నాటి స్టార్లే స్ఫూర్తిగా..!
ఇప్పటితరం సైతం నాటి తరం హీరోలను అనుసరిస్తున్నారు. ప్రయోగాలు చేస్తున్నారు. అప్పటి కాస్ట్యూమ్ డిజైనర్స్ రూపొందించిన బెల్ ఫ్యాంట్స్..బూట్ కట్స్..స్కిన్ టైట్ చడ్డీలు ఇప్పటికీ రిపీటవుతున్నాయి. 2000 -2010 మధ్యకాలం యువత కూడా వాడుకలోకి తెచ్చింది. ముఖానికి అందాన్ని తీసుకొచ్చే కళ్లద్దాలు ఎన్ని ఉన్నా రేబాన్ ఇప్పటికీ మార్కెట్ లో ఉంది అంటే! ఆ బ్రాండ్ కి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ఇక చెడ్డీ స్టార్ గానూ గంగోత్రి చిత్రంతో అల్లు అర్జున్ తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.