'ఆచార్య' రిలీజ్ రోజే ఆ విషయంపై క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో రూపొందిన ఆచార్య సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2020 సంవత్సరంలో విడుదల అవ్వాల్సిన ఆచార్య సినిమా కరోనా వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ దాదాపు గా రెండేళ్ల ఆలస్యంగా విడుదల అయ్యింది. చిరంజీవితో పాటు ఈ సినిమాలో చరణ్ కూడా ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
సినిమాలో చరణ్ మరియు చిరంజీవి లు కలిసి ఉన్న సన్నివేశాలకు మంచి స్పందన వస్తుంది. సినిమా విడుదల అయిన నేడే సినిమా స్ట్రీమింగ్ పార్టనర్ పై క్లారిటీ వచ్చింది. మొన్నటి వరకు అమెజాన్ ప్రైమ్ లేదా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తలపై క్లారిటీ లేకపోవడంతో అంతా కూడా పుకార్లుగానే భావించారు.
తాజాగా ఆచార్య సినిమా విడుదల సమయంలో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా పోస్ట్ రిలీజ్ స్ట్రీమింగ్ కు ఆచార్య బిజినెస్ జరిగి పోయిందని క్లారిటీ వచ్చింది. ఈమద్య కాలంలో అమెజాన్ మార్కెట్ లో ఉన్న పోటీ నేపథ్యంలో భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు ముందుకు వస్తుంది. అమెజాన్ తో పాటు ప్రముఖ ఓటీటీ లు కూడా ఆచార్య సినిమా ను దక్కించుకునేందుకు పోటీ పడ్డట్లుగా సమాచారం అందుతోంది.
చిరంజీవి మరియు చరణ్ తో పాటు అపజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అవ్వడంతో భారీ మొత్తానికి అమెజాన్ వారు ఆచార్య సినిమాను దక్కించుకున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఆచార్య సినిమా ను విడుదల అయిన నాలుగు వారాల తర్వాత అమెజాన్ వారు స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం జరిగిందనే వార్తలు వస్తున్నాయి.
ఈమద్య కాలంలో ఎక్కువ సినిమాలు నాలుగు వారాలు లేదా ఆరు వారాల థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమా లు 50 రోజుల వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆచార్య సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుందని క్లారిటీ వచ్చింది కాని.. ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యే విషయంలో మాత్రం స్పష్టత లేదు. సినిమా కు వచ్చిన టాక్.. మరియు వచ్చే వసూళ్లను బట్టి స్ట్రీమింగ్ డేట్ ను నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది.