సెప్టెంబర్ లో మనోజ్ ఎటాక్

Update: 2015-07-30 06:01 GMT
వర్మ తన పంథా మార్చి తీసిన సినిమా 365 రోజులు నిండా వారం కూడా ఆడలేదు. తర్వాతి సినిమా అయిన ఎటాక్ లో మాత్రం పూర్తిగా తన  మార్క్ ని చూపిస్తున్నాడు. మాఫియా, ఫ్యాక్షనిజం, రక్తపాతల కథలు తెరకెక్కించడం వర్మకి ఎంత ప్రీతిపాత్రమో అందరికీ తెలిసిందే. ఇప్పటికే విడుదలైన విజువల్స్ లో అది కళ్ళముందు సాక్షాత్కరించింది. నరికెయ్.. నరికెయ్ అంటూ మనోజ్ ని బాగానే పూనకం వచ్చేలా ప్రోత్సహించాడు.

ఇది చూసిన సినీ జనాలు ఎన్నాళ్ళకు అసలు వర్మ బయటకొచ్చాడు అనుకుంటున్నారు. అది నిజమో కాదో తెలియాలంటే సినిమా చూడాలి కదా. విడుదలకి వర్మ విష్ణు బాబుతో (ఈ సినిమా నిర్మిస్తుంది విష్ణు బాబే మరి) కలిసి ముహూర్తం ఫిక్స్ చేశారట. సెప్టెంబర్ లో మనోజ్ తో ఎటాక్ చేయించాలని వీరిద్దరి ప్లాన్. మనోజ్ ఈ సంవత్సరం అసలు సిల్వర్ స్క్రీన్ పై కనపడనే లేదు. అక్క ఆడిన దొంగాటలో ఓ పాటలో తళుక్కుమన్నాడంతే. ఈ సినిమా గనక విజయం సాధిస్తే పెళ్లి తర్వాత మనోజ్ కి చాలారోజుల తర్వాత వర్మకి ఓ హిట్ వచ్చినట్టే.          
Tags:    

Similar News