• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోలకు ధీటుగా విలన్...

హీరోలకు ధీటుగా విలన్ పాత్రలు: మారిన ట్రెండ్!

| అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎప్పుడూ విలన్ పాత్రలను పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దుతారని పేరుంది.

By - Tupaki Desk
Update: 2026-09-05 15:30 GMT

ఒకప్పుడు భారతీయ సినిమాలో విలన్ అంటే హీరో చేతిలో దెబ్బలు తినడానికి.. చివర్లో అంతమవ్వడానికి మాత్రమే పరిమితమయ్యే పాత్ర. కానీ ఇప్పటి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కథలో విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే? ఆ విలన్‌ను ఢీకొట్టే హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందనే సూత్రాన్ని నేటి దర్శకులు బలంగా నమ్ముతున్నారు. హీరో పాత్రకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. సవాలు విసిరే విధంగా విలన్ పాత్రలకు ప్రాణం పోస్తుండటంతో ఇండియన్ సినిమాలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని న‌టిస్తోన్న భారీ చిత్రం `పారడైజ్` పై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నానికి పోటీగా ప్రతికూల ఛాయలున్న పవర్ ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ విక్రమ్ మాలిక్ అనే పాత్రలో నటిస్తున్నారు. సాధారణంగా విలన్ పాత్రలలో కనిపించని రాఘవ్ ఈ చిత్రంలో ఎంతటి క్రూరమైన నటనకు ప్రాధాన్యమున్న పాత్ర పోషిస్తున్నారో మేకర్స్ ఇస్తున్న లీక్స్ ను బ‌ట్టే తెలుస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎప్పుడూ విలన్ పాత్రలను పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దుతారని పేరుంది. ఆయన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`లో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా అనే ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. హీరోకు తగ్గట్లే సమానమైన బలంతో, ఆధిపత్యం ప్రదర్శించే పాత్రగా కుంభా క్యారెక్టర్ రూపుదిద్దుకుంటోంది.

అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ `సలార్ 2`లోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కొనసాగుతున్నారు. ప్రభాస్ పాత్రకు సరిసమానమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఫ్రెండ్‌షిప్ నుంచి శత్రుత్వంలోకి మారే క్రమంలో ఉండే భావోద్వేగాలను పృథ్వీరాజ్ పవర్‌ఫుల్ నటనతో పండించబోతున్నారు. ఇంకా `క‌ల్కి 2` లో లోకనాయకుడు కమల్ హాసన్ యాస్కిన్ పాత్రలో పూర్తిస్థాయి విశ్వరూపం చూపించనున్నారు.

ఈ పాత్ర గ‌నుక పండితే? క‌మ‌ల్ ఇమేజ్ కొత్త కోణంలో హైలైట్ అవుతుంది.

ఇలా సౌత్ స్టార్లనే విలన్లుగా చూపించడం సినిమా స్థాయిని మరింత పెంచుతోంది. ఈ ట్రెండ్ వల్ల వేర్వేరు భాషలకు చెందిన స్టార్ నటులు ఒకే వేదికపైకి రావడం సాధ్యమవుతోంది. ఇది సినిమా బాక్సాఫీస్ మార్కెట్‌ను పెంచడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అనుభూతిని ఇస్తోంది. విలన్ పాత్రలు భయాన్ని కలిగించడమే కాకుండా వారి నటనతో ప్రేక్షకులను మెప్పించి కథను నడిపించే శక్తులుగా మారుతున్నాయి.

అంతిమంగా ఇండియన్ సినిమాలో హీరో-విలన్ల మధ్య పోరు కొట్లాటలకు పరిమితం కాలేదు. మైండ్ గేమ్‌లు - నటనతో పోటీపడే స్థాయికి చేరింది. విలనిజానికి లభిస్తున్న ప్రాధాన్యత భ‌విష్య‌త్ లో మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు వెండితెరకు రావడానికి మార్గం సుగమం చేస్తోందని చెప్పొచ్చు.

Tags:    
  • indiancinema 
  • southcinema 
  • tollywood 
  • villainroles 
  • panindiacinema 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS