9 మంది దర్శకులతో మణిరత్నం వెబ్ సిరీస్
గతంలో బుల్లి తెరపై ఆసక్తి లేదంటూ వ్యాఖ్యలు చేసిన మణిరత్నం తన ఆలోచన మార్చుకుని వెబ్ సిరీస్ లు చేసేందుకు సిద్దం అయ్యాడు. ‘నవరస’ అనే ఒక వెబ్ సిరీస్ ను 9 ఎపిసోడ్స్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. నవ రసాల్లో ఒక్కో రసంకు ఒక్కో ఎపిసోడ్ తరహాలో ఉంటుందని తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. వెబ్ సిరీస్ లు ఈమద్య కాలంలో చాలా ట్రెండ్ అవుతున్నాయి. సినిమాల కంటే ఎక్కువ ఆసక్తిని వెబ్ సిరీస్ లు దక్కించుకుంటున్నాయి.
ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. అతి త్వరలోనే మరో కీలక ప్రకటన రాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు గాను ఏకంగా 9 మంది దర్శకులతో మణిరత్నం పని చేస్తాడని అంటున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో దర్శకుడు పని చేస్తాడని అంటున్నారు.
ఇప్పటికే 9 మంది దర్శకుల్లో గౌతమ్ మీనన్.. కార్తీక్ నరేన్.. నంబియర్.. అరవింద్ స్వామిలతో మణిరత్నం చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే మిగిలిన దర్శకులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. నవసర కాన్సెప్ట్ ఏంటీ ఎవరు నటించబోతున్నారు. ఇంత మంది దర్శకులు ఎందుకు అనే విషయాలు అందరికి ఆసక్తిని కలిగిస్తున్నాయి.