'అయ్యప్పనుమ్ కోషియ‌మ్' తెలుగు రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న మలయాళ బ్యూటీ..?

Update: 2020-11-18 09:30 GMT
మలయాళ బ్యూటీ మమతా మోహన్ దాస్... తన నటనతోనే కాదు పాటలతోనూ తెలుగు ప్రేక్షకులను అలరించింది. 'యమదొంగ' చింతకాయల రవి' 'కింగ్' 'కేడి' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కొంతకాలం పాటు తెలుగులో హవా చూపించిన మమత.. ఉన్నట్టుండి తెలుగులో కనిపించకుండా వినిపించకుండా వెళ్లిపోయింది. అయితే క్యాన్సర్ బారిన పడిన మమతా మోహన్ దాస్.. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని దాని నుంచి బయటపడింది. అదే సమయంలో పెళ్ళైన ఏడాదికే భర్త తో విడిపోయింది. ఆ తర్వాత పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టిన మమత.. కన్నడ మలయాళ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మమత మ‌ళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో హీరోయిన్ గా సింగ‌ర్ క‌మ్ యాక్ట‌ర్ మ‌మ‌తా మోహ‌న్ దాస్ ని ఈ చిత్రం కోసం సంప్రదిస్తున్నారనే టాక్ ప్ర‌స్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్ కి దూరమైన మమతా.. ఇటీవల 'ఆహా' వచ్చిన 'ఫోరెన్సిక్' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మరి ఇప్పుడు ఈ మలయాళ స్టార్ హీరోయిన్ ని 'అయ్యప్పనుమ్ కోషియ‌మ్' తెలుగు రీమేక్ లోకి తీసుకోవాల‌ని ట్రై చేస్తున్న‌ట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
Tags:    

Similar News