పవన్ సినిమా అయ్యాకే మహేష్ మూవీ పనులు..!

Update: 2021-08-12 11:19 GMT
'అల వైకుంఠపురములో' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా అనౌన్స్ చేసాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తో తదుపరి సినిమాని సెట్ చేసుకున్నాడు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించే చిత్రానికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ రాసే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా పవన్ చిత్రాన్ని కంప్లీట్ చేసిన తర్వాతే మహేష్ సినిమా పనులు మొదలు పెట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ - రానా కలిసి 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు. దీనికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - మాటలు రాయడమే కాకుండా.. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ ఎన్ని రోజులు షూటింగ్ లో పాల్గొంటే అన్ని రోజులూ త్రివిక్రమ్ కూడా సెట్ లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఏకే' రీమేక్ పనుల్లో నిమగ్నమైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇంకా మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయలేదనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

'అతడు' 'ఖలేజా' వంటి రెండు క్లాసిక్స్ తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో SSMB28 ప్రాజెక్ట్ కోసం అధికారిక ప్రకటన వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే హీరోయిన్ ని ఫైనలైజ్ చేసిన మేకర్స్.. సాంకేతిక నిపుణుల వివరాలను కూడా వెల్లడించారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని అభిమానులు అందరూ భావిస్తుండగా.. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదనే న్యూస్ ప్రచారంలో ఉంది.

త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్.. 'సర్కారు వారి పాట' షూటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి SSMB28 స్క్రిప్ట్ రెడీ చేస్తారని నమ్మకంగా ఉన్నారట. ఇప్పుడు ఎలాగూ 'PSPKRana' సినిమా చివరి దశకు వచ్చేసింది కాబట్టి.. త్రివిక్రమ్ త్వరలోనే మహేష్ సినిమా పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అక్టోబర్ లో మహేష్ - త్రివిక్రమ్ సినిమా షురూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని టాక్. ఎప్పుడు స్టార్ట్ చేసినా వచ్చే ఏడాది వేసవి నాటికి ఈ సినిమా రెడీ అవుతుందని అంటున్నారు.

#SSMB28 ఒక యాక్షన్ జోనర్ సినిమా అని.. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది. ఇందులో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. మది సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్న ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు.
Tags:    

Similar News