మెగా డాట‌ర్ గ్రాండ్ గానే ప్లాన్ చేస్తోందా?

మెగా డాట‌ర్ సుస్మిత తొలి సినిమాతోనే గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై డాడ్ చిరంజీవితో నిర్మించిన 'మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు' బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో? ప‌ట్ట‌లేని సంతోషంలో ఉన్నారు.;

Update: 2026-01-23 18:30 GMT

మెగా డాట‌ర్ సుస్మిత తొలి సినిమాతోనే గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై డాడ్ చిరంజీవితో నిర్మించిన `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో? ప‌ట్ట‌లేని సంతోషంలో ఉన్నారు. ఇప్ప‌టికే సినిమా 300 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ లాభాలు చూపించిన నిర్మాత‌గా సుస్మిత వెలిగిపోతున్నారు. నిన్న మొన్న‌టివ‌ర‌కూ కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ఉన్న సుస్మిత తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ అవ్వ‌డంతో మెగా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. మ‌రి ఈ సెల‌బ్రేష‌న్స్ కుటుంబంతో ఎలా ప్లాన్ చేస్తున్నారంటే? గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్న‌ట్లు సుస్మిత మాట‌ల్లో అర్ద‌మ‌వుతుంది.

సినిమా స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిన వెంట‌నే వ‌రుణ్ తేజ్ పార్టీ అడిగాడు అట‌. ఆ త‌ర్వాత మిగ‌తా కుటుంబ స‌భ్యులంతా పార్టీ అడిగిన‌ట్లు గుర్తు చేసుకున్నారు. మ‌రి పార్టీ ఎక్క‌డ అంటే కుటుంబ సభ్యులంద‌రితో క‌లిసి వెకేష‌న్ ప్లాన్ చేస్తున్న‌ట్లు సుస్మిత మాట‌ల్లో తేలింది. అకేష‌న‌ల్ గా కుటుంబ స‌భ్యులంతా ఒకే చోట గేద‌ర్ అవుతుంటారు. క‌లిసి వెకేష‌న్ల‌కు వెళ్తుంటారు. అయితే అప్పుడు ఎవ‌రి ఖ‌ర్చులు వారు భ‌రించాల్సి ఉంటుంది. ఈసారి సుస్మిత నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యారు కాబ‌ట్టి అన్ని ర‌కాల ఖ‌ర్చులు భ‌రించి తానే ట్రిప్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం చిరంజీవి స్విట్జ‌ర్లాండ్ వెకేష‌న్ లో ఉన్నారు. రామ్ చ‌ర‌ణ్ కూడా హైద‌రాబాద్ లో లేరు. విదేశాల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మిగ‌తా వారంతా ఎవ‌రి సినిమా షూటింగ్స్ లో వారు బిజీగా ఉన్నారు. వారంతా ప్రీ అవ్వ‌గానే సుస్మిత తండ్రి స‌హా చిన్నాన్న‌ క‌టుంబం, మెగా అల్లుళ్లు అంతా క‌లిసి వెకేష‌న్ కు వెళ్లే అవ‌కాశం ఉంది. మ‌రి సుస్మిత రెండ‌వ సినిమా ఏ హీరోతో ప్లాన్ చేస్తున్నారు అన్న‌ది చూడాలి. సుస్మిత ప‌ని చేయాల్సిన మెగా హీరోలు చాలా మంది ఉన్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది.

వ‌రుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి తేజ్ లాంటి వాళ్ల డేట్లు సుస్మిత‌కు ఇప్ప‌టికిప్పుడు దొరికే అవ‌కాశం ఉంది. మ‌రి వాళ్ల‌తో ముంద‌కెళ్తారా? బ‌య‌ట హీరోల‌తో సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నారా? అన్న‌ది తెలియాలి. అలాగే స్టోరీల ప‌రంగా సుస్మిత టేస్ట్ కూడా ముఖ్య‌మే. క‌మ‌ర్శియ‌ల్ క‌థ‌ల‌కే ప్రాధాన్య‌త ఇస్తారా? ఇన్నోవేటివ్ ఐడియాల్ని ప్రోత్స‌హిస్తారా? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో స్టార్ ప్రొడ్యూస‌ర్ అశ్వీనీద‌త్ వార‌సురాళ్లుగా స్వ‌ప్న‌, ప్రియాంక ద‌త్ లు నిర్మాత‌లుగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ కుమార్తె తేజ‌స్వీని కూడా నిర్మాణంలోకి ఎంట‌ర్ అవుతున్నారు.

Tags:    

Similar News