'సర్కే చునారే తేరీ సర్కే' పాటలో ఏముంది? ఎందుకంత రచ్చ?

‘సర్కే చునారే తేరీ సర్కే’ పాట పుణ్యమా అని కేడీ: ది డెవిల్ మూవీ మీద చర్చ మొదలైంది. అగ్ర దర్శకుడు రాజమౌళి పుణ్యమా అని ఫిలిం మేకింగ్ లో పూర్తి మార్పులు వచ్చాయి.;

Update: 2026-03-18 14:37 GMT

‘సర్కే చునారే తేరీ సర్కే’ పాట పుణ్యమా అని కేడీ: ది డెవిల్ మూవీ మీద చర్చ మొదలైంది. అగ్ర దర్శకుడు రాజమౌళి పుణ్యమా అని ఫిలిం మేకింగ్ లో పూర్తి మార్పులు వచ్చాయి. బాహుబలితో భారీ ప్రాజెక్టు మూవీ ఏదైనా పాన్ ఇండియాలో విడుదల చేసేలా ప్లాన్ చేసేలా చేశారు. గతంలో అలా ఆలోచించే సాహసం చేసే నిర్మాతలు వేళ్ల మీద లెక్కించే వారే ఉండేవారు. ఎప్పుడైతే.. రాజమౌళి మూవీ ప్లానింగ్ చూసిన తర్వాత సినీ నిర్మాతల ఆలోచన తీరు పూర్తి మారింది. ఆ వరసలోకే వస్తుంది కేడీ: ది డెవిల్.

ఈ కన్నడ మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గట్లే భారీ తారాగణాన్ని ఎంపిక చేశారు. 1970ల నాటి బెంగళూరు అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీలో ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్నారు. కాళీగా పవర్ ఫఉల్ గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహిలతో పాటు కన్నడ సీనియర్ హీరోలు రవిచంద్రన్, రమేష్ అరవింద్ లాంటి వారు మాత్రమే కాదు.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు దర్శకుడిగా మాస్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి హీరోయిన్ గా రీష్మా నానయ్య నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం హీరో ధ్రువ సర్జా ఎంతో కష్టపడ్డారు. మామూలుగానే ఆయన ఒక సినిమా చేయటానికి చాలా టైం తీసుకుంటారు. కేడీ సినిమా కోసం ఆయన తన లుక్ మొత్తాన్ని మార్చుకోవటానికి.. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించేందుకు వీలుగా బాడీని మార్చుకోవటం గమనార్హం. ఈ సినిమాలో ఒక క్లబ్ సాంగ్ లోనే వస్తుంది సర్కే చునారే తేరీ సర్కే సాంగ్.

ఈ పాట అంతలా వివాదం కావటానికి కారణం హిందీలో రాసిన లిరిక్స్ గా చెప్పాలి. డబుల్ మీనింగ్ వచ్చేలా ఉన్న ఈ సాంగ్ అర్థం పరమ భయానకంగా ఉండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటను బ్యాన్ చేసిన నేపథ్యంలో ఈ పాటను పూర్తిగా వివరించి చెప్పలేని పరిస్థితి. కాకుంటే.. ఈ పాట అంతలా వివాదాస్పదం కావటానికి ప్రధాన కారణం.. పాట చివర్లో ముందు చెప్పిందంతా ఒక లిక్కర్ బాటిల్ అన్నట్లు చెప్పినప్పటికి.. అసలు విషయం ఏమిటో అందరికి అర్థమయ్యేలా ఉంటుంది.

సర్కే చునారే అంటే చీర కొంగు జారుతోందన్న అర్థంతో సాగే ఈ పాటలో నోరా ఫతేహి తన చీర కొంగును జారవిడుస్తూ తడ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ పాటలో తీవ్ర అభ్యంతరానికి కారణమైన ద్వంద్వార్థ పదాల విషయానికి వస్తే. పహలే ఉఠాలే అంటే ముందు పైకి లేపు.. అందర్ వో డాలే.. లోపలికి అది వేయి అన్నది అర్థం.. ఖోల్ కే పీలే మూత తీసి తాగేయ్ లాంటి పదాలు వాడటం.. అందుకు తగ్గట్లు నోరా ఫతేహి డ్యాన్స్ మూమెంట్లు ఉండటం ఈ వివాదాన్ని మరింత రగిలేలా చేసిందని చెప్పాలి. అయితే.. హిందీ వెర్షన్ లో రాసిన పాటకు సంబంధించిన పదాలు తన అనుమతి లేకుండా వచ్చాయని రాకీబ్ ఆలం చెప్పారు. కన్నడలో రాసిన బూతు సాహిత్యాన్ని అలానే హిందీలోకి అనువదించాలని అడిగితే.. తాను నో చెప్పానని చెప్పారు. తన పేరును వాడుకొని ఆ అశ్లీల పదాల్ని పాటలో ఉంచినట్లుగా చెప్పటం గమనార్హం.

Tags:    

Similar News