2026 లో త‌మ‌న్నా కొత్త‌గా ప్లాన్ చేస్తోందా?

అయితే కొత్త ఏడాదిలో అమ్మ‌డు కెరీర్ కొత్త‌గా ప్లాన్ చేస్తోంద‌న్న‌ది తాజా స‌మాచారం. సౌత్ సినిమాలు త‌గ్గించి బాలీ వుడ్ లో సీరియస్ గా ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకుందిట‌.;

Update: 2026-01-23 19:30 GMT

ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ఎలా సాగింద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు, త‌మిళ‌ చిత్రాల్లో త‌న‌దైన ముద్ర వేసింది. `హ్యాపీడేస్` తో వెలుగులోకి వ‌చ్చిన అమ్మ‌డు రెండు భాష‌ల్లోనూ సుదీర్ఘ ప్ర‌యాణాన్ని కొన‌సాగించింది. రెండు భాష‌ల్లోనూ న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. త‌మ‌న్నా న‌టించ‌ని హీరో అంటూ ఎవ‌రూ లేరు. తెలుగులో కొంత మంది సీనియ‌ర్ హీరోలు మిన‌హా దాదాపు అంద‌రితో క‌లిసి ప‌ని చేసింది. అలాగే సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ అమ్మ‌డు ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

హీరోయిన్ అవ‌కాశాలే కావాల‌ని కూర్చోలేదు. వ‌చ్చిన పాత్ర‌ల‌తో సంతృప్తి చెందింది. ఈ క్ర‌మంలో ఐటం భామ‌గాను అవ‌తారం ఎత్తింది. అక్క‌డా త‌న‌దైన ముద్ర వేసింది. సీన్ అయినా? పాట అయినా త‌మ‌న్నాకు ఒక‌టే అని నిరూపించింది. హీరోయిన్లు ఇలా స‌క్స‌స్ అవ్వ‌డం అన్న‌ది త‌మ‌న్నాకి మాత్రమే చెల్లింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ , స‌మంత లాంటి వాళ్లు కూడా ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చేసారు గానీ స‌క్సెస్ అవ్వ‌లేదు. కొన్ని సినిమాల‌కే ప‌రిమిత‌య్యారు. కానీ త‌మ‌న్నా? మాత్రం అందులోనూ మాస్ట‌ర్ అనిపించింది. త‌మిళ‌, తెలుగు సినిమాల‌తో పాటు సెకెండ్ ఇన్నింగ్స్ లో హిందీలోనూ బాగానే న‌టించింది.

అయితే కొత్త ఏడాదిలో అమ్మ‌డు కెరీర్ కొత్త‌గా ప్లాన్ చేస్తోంద‌న్న‌ది తాజా స‌మాచారం. సౌత్ సినిమాలు త‌గ్గించి బాలీ వుడ్ లో సీరియస్ గా ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకుందిట‌. ఒకే సారి మూడు భాష‌ల్ని మ్యానేజ్ చేయ‌డం క‌ష్టంగా ఉండ‌టంతో? బాలీవుడ్ కి దూర‌మ‌వుతున్నాన‌నే ఆలోచ‌న నుంచి అమ్మ‌డు మ‌న‌సు మారిన‌ట్లు ప్ర‌చారం జ‌రు గుతోంది. అలాగ‌ని అక్క‌డ ఐటం పాట‌ల‌కో, ప్ర‌త్యేక పాత్ర‌ల‌కే పరిమితం అవ్వాల‌నుకోలేదు. న‌టిగానే బాలీవుడ్ లో త‌న‌దైన ముద్ర వేయాల‌ని అడుగులు వేస్తోందిట‌. ఈనేప‌థ్యంలోనే బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నఓ సినిమాతో పాటు, కరీనా కపూర్ `క్రూ 2`, `గోల్‌మాల్ 5`, మడాక్ ఫిలిమ్స్ హారర్-కామెడీ యూనివర్స్ భాగ‌మ‌వ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోందిట‌. ఇప్ప‌టికే ఆ చిత్రాల ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు టచ్ లోకి వెళ్లిందిట‌. ఈ నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం కూడా లీకైంది. కార్తీక్ ఆర్య‌న్ న‌టిస్తోన్న `నాగ్ జిల్లా` ప్రాజెక్ట్ ను త‌మ‌న్నా కావాల‌నే వ‌దుల‌కుందంటున్నారు. ఈ ఛాన్స్ వ‌ద‌లుకోవ‌డం వెనుక ఓ మాస్ట‌ర్ ప్లాన్ ఉందిట‌.ప్ర‌స్తుతం త‌మ‌న్నా షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న `ఓ రోమియో`లో న‌టిస్తోంది. అలాగే సిద్దార్ద్ మ‌ల్హోత్రా ప్రాజెక్ట్ `వ్యాన్` లోనూ న‌టిస్తోంది. ముంబై మాజీ క‌మీష‌న‌ర్ రాకేష్ మరియా బయోపిక్లో నూ న‌టిస్తోంది.

Tags:    

Similar News