40 లక్షల భారీ మోసం.. ఆరోపణలపై స్పందించిన స్మృతి మాజీ ప్రియుడు పలాష్..
ఆయన తన సోషల్ మీడియా వేదికగా.." సాంగ్లీకి చెందిన విద్యాన్ మానే సోషల్ మీడియాలో నాపై చేసిన చీటింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి.;
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన.. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ తో గతంలో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు కూడా.. పైగా గత ఏడాది నవంబర్ 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి మందాన తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్ పాలవడం.. ఆ మరుసటి రోజు పలాష్ ముచ్చల్ కూడా హాస్పిటల్ పాలయ్యారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ వివాహాన్ని కాస్త రద్దు చేసుకున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. తమ గోప్యతకు భంగం కలిగించకూడదు అని.. తమ నిర్ణయాన్ని గౌరవించాలి అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు కూడా..
అయితే ఇప్పుడు ఏకంగా పలాష్ ముచ్చల్ పై చీటింగ్ ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. 'నజారియా' అనే సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టాలని పలాష్ ఫిలిం ఫైనాన్షియర్ విద్యాన్ మానే కి సూచించారట..అయితే అతను మాటలు నమ్మి నలభై లక్షలు ఇన్వెస్ట్ చేశానని.. కానీ ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు అంటూ విద్యాన్ మానే పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా సాంగ్లీ పోలీసులకు అందజేశాడు అంటూ ఆరోపణలు రాగా..ఈ వార్తలు కాస్త వైరల్ అవ్వడంతో దీనిపై పలాష్ ముచ్చల్ స్పందించారు.
ఆయన తన సోషల్ మీడియా వేదికగా.." సాంగ్లీకి చెందిన విద్యాన్ మానే సోషల్ మీడియాలో నాపై చేసిన చీటింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. అవాస్తవమైనవి కూడా.. ముఖ్యంగా నా ప్రతిష్టని దెబ్బతీసే దురుద్దేశంతోనే అతడిలా తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటాము" అంటూ పలాష్ తెలిపారు. మొత్తానికైతే 40 లక్షలు మోసం చేశాడు అంటూ వస్తున్న ఆరోపణలపై పలాష్ స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టారు. మొత్తానికైతే అభిమానులు ఈ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.
పలాష్ ముచ్చల్ విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ఈయన మంచి సింగర్ కూడా.. ఇక ఈయన ఎవరో కాదు ప్రముఖ ఇండియన్ సింగర్ పాలక్ ముచ్చల్ కి స్వయానా సోదరుడు. అంతేకాదు స్వరకర్త మిథూన్ కి బావమరిది అవుతారు. ఇకపోతే ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు దక్కించుకున్న ఈయన గాయకుడిగా కూడా పేరు అందుకున్నారు. అంతేకాదు పలు ఆల్బమ్స్ కి, మరికొన్ని చిత్రాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు.