రాజసం ఉట్టిపడేలా.. చీరకట్టులో రాశి ఖన్నా అందాలు..

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా.;

Update: 2026-01-23 17:30 GMT

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా. 2013లో 'మద్రాస్ కేఫ్'అనే సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో 2014లో అక్కినేని కుటుంబం నటించిన 'మనం' అనే సినిమాలో కేమియో పాత్రలో కనిపించి బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా భారీ క్రేజీ సంపాదించుకొని జోరు, జిల్, బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ తదితర చిత్రాలలో నటించి హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకుంది.



 


సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్న రాశి ఖన్నా బ్లాస్ట్ అయ్యే అందాలతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలతో కూడా సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చీరకట్టులో మరింత అందంగా ఆకట్టుకుంటోంది. చీరకట్టులో కూడా అందాలను దాస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె.. ఈ ఫోటోలు చూసి అభిమానులు లవ్ , ఫైర్ సింబల్ తో వైరల్ చేస్తున్నారు. ఈ అమ్మడు చీరకట్టులో ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇంకొంతమంది రాజసం ఉట్టిపడేలా చీర కట్టులో ఆకట్టుకుంటోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.



 


రాశి ఖన్నా చివరిగా 2025 లో వచ్చిన 'తెలుసు కదా' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటుగా తమిళంలో ఒక సినిమా, హిందీలో మూడు చిత్రాలలో నటిస్తోంది. గతంలో చాలా బొద్దుగా ఉండే రాశి ఖన్నా ఈ మధ్యకాలంలో మరింత స్లిమ్ముగా మారి వరుస అవకాశాలను అందుకుంటోంది. తన పాత్ర నచ్చితే మాత్రం రాశి ఖన్నా సెకండ్ హీరోయిన్గా కూడా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది.గతంలో కూడా ఇలా ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.



 


ప్రస్తుతం ఈమె ఫోకస్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైనే పెట్టిందని చెప్పవచ్చు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నాతో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీలా కూడా హీరోయిన్గా నటిస్తోంది. ముఖ్యంగా 13 ఏళ్ల తర్వాత మళ్లీ హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబో రిపీట్ కాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాతో రాశి ఖన్నా కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంటుందని , ఈ సినిమాతో కచ్చితంగా టాలీవుడ్ లో కం బ్యాక్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా రాశి ఖన్నాకు ఎలాంటి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి.



 


Tags:    

Similar News