ష్.. అందాలతో చెమటలు పట్టిస్తున్న లేడీ బాస్ !

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందం, అభినయం తో ఆకట్టుకుంటూ తమకంటూ ఒక పేరు దక్కించుకున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు.;

Update: 2026-01-23 13:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందం, అభినయం తో ఆకట్టుకుంటూ తమకంటూ ఒక పేరు దక్కించుకున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నేహా శెట్టి కూడా ఒకరు. మొదటిసారి ప్రముఖ దిగ్గజ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ నటించిన 'మెహబూబా' చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది నేహా శెట్టి. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా తన యాక్టింగ్ తో.. అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ డీజే టిల్లు సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా.. నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. రాధికా పాత్రతో అద్భుతమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక నేహా శెట్టి బయట ఎక్కడ కనిపించినా సరే ఈమెను రాధిక అంటూ పిలవడం మొదలుపెట్టారట ఆడియన్స్. దీన్ని బట్టి చూస్తే రాధికా పాత్రకు నేహా శెట్టి ఏ రేంజ్ లో న్యాయం చేసిందో అర్థం చేసుకోవచ్చు.




ఇలా ఒక వైపు సినిమాల్లో అలరిస్తున్న ఈమె మరోవైపు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు కొనుక్కు లేకుండా చేస్తోంది. తాజాగా టాప్ టు బాటమ్ కోట్ ధరించి తన అందాలతో మతులు పోగోడుతోంది. సోఫా పైన వయ్యారంగా కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పైగా ష్ .. అంటూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అభిమానులు లేడీ బాస్ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజెన్స్ ఆ సోఫా నేనైతే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




నేహా శెట్టి చివరిగా గత ఏడాది ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్లో కనిపించింది. అలాగే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వెలువడుతున్నాయి.




నేహా శెట్టి కర్ణాటకలోని మంగళూరులో పుట్టి..బెంగళూరులో పెరిగింది. ఈమె తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి దంత వైద్యురాలు. నేహా శెట్టికి ఒక సోదరి కూడా ఉంది. సినిమాల్లోకి రావాలనుకున్న ఈమె అందులో భాగంగానే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలా తొలిసారి 2014లో మిస్ మంగళూరు పోటీలలో పాల్గొని టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2015లో మిస్ సౌత్ ఇండియా 2015 పోటీలలో పాల్గొని రన్నరప్ గా నిలిచింది.. ఇక ప్రముఖ దర్శకుడు శశాంక్ తీసిన కన్నడ చిత్రం ముంగారు మలే 2 లో కనిపించి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా సరే ఇందులో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Tags:    

Similar News