హీరో కన్నా హీరోయిన్ చాలా చిన్న.. మేకర్స్ ఆలోచనేంటి?

ముఖ్యంగా యూత్ తో పాటు సినీ ప్రియుల ఒపినీయన్స్ మారిన ప్రస్తుత రోజుల్లో అలాంటి స్టోరీలపై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది.;

Update: 2026-03-17 11:03 GMT

హీరో హీరోయిన్ల వయస్సులో ఎక్కువ తేడా ఉన్న ప్రేమ కథలు.. ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్నా, ఇప్పుడు మాత్రం అదే స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోతున్నాయని కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా యూత్ తో పాటు సినీ ప్రియుల ఒపినీయన్స్ మారిన ప్రస్తుత రోజుల్లో అలాంటి స్టోరీలపై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్‌ లో దే దే ప్యార్ దే సినిమా అందుకు ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.

ఆ సినిమాలో అజయ్ దేవగన్ 50 ఏళ్ల వ్యక్తిగా, రకుల్ ప్రీత్ సింగ్ 20 ఏళ్ల యువతిగా నటించారు. వయస్సులో భారీ తేడా ఉన్న ఆ ప్రేమకథ ప్రేక్షకులకు కొత్తగా అనిపించి.. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించింది. అయితే, తర్వాత వచ్చిన సీక్వెల్ మాత్రం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం, ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా మార్పులు లేకపోవడం అందుకు ప్రధాన కారణం.

ఇప్పుడు ఆ సినిమా కోసం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కూడా వయస్సులో తేడా ఉన్న ప్రేమ కథనే ప్రధానంగా తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆ థీమ్ మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఆ టైప్ స్టోరీస్ తెలుగు ఆడియన్స్ ను కొత్తేం కాదు. టాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ కాలంలో పెద్ద వయసు హీరో.. చిన్న వయసు హీరోయిన్ అంటూ అనేక లవ్ స్టోరీ మూవీస్ వచ్చాయి. ఆ సమయంలో ప్రేక్షకులు వాటిని ఆదరించారు కూడా. అప్పటి పరిస్థితులు, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ కు ఆయా చిత్రాల మేకర్స్ ఇచ్చిన ప్రాధాన్యత వల్ల ఆ కథలు సక్సెస్ అయ్యాయి.

కానీ, ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ముఖ్యంగా జెన్ జెడ్ ఆడియన్స్ స్టోరీల్లో రియాలిటీ, ఈక్వాలిటీ, ప్రజెంట్ డేస్ ఎలా ఉన్నాయో అదే కోరుకుంటున్నారు. వయస్సులో పెద్ద తేడా ఉన్న ప్రేమ కథలను వారు అంతగా అంగీకరించడం లేదు. అందుకే ఇటీవలి కాలంలో ఆ థీమ్‌ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోతున్నాయి.

అయినా కూడా దర్శకులు, నిర్మాతలు ఆ తరహా కథలు వదలడం లేదు. కొత్త యాంగిల్ లో చూపిస్తే ప్రేక్షకులు మళ్లీ యాక్సెప్ట్ చేస్తారని వారు భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే భవిష్యత్తులో కూడా ఆ థీమ్‌ తో సినిమాలు రావడం కొనసాగుతాయని చెప్పవచ్చు. మొత్తానికి.. వయస్సు తేడా ఉన్న ప్రేమ కథలు ఇప్పుడు సవాల్‌ గా మారాయి. పాత కాలంలో హిట్ అయిన ఆ ఫార్ములా.. కొత్త జెనరేషన్ కు నచ్చాలంటే కథలో కొత్తదనం, స్ట్రాంగ్ ఎమోషన్స్ అవసరం. లేదంటే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News