ఉస్తాద్ టీమ్ పై ఒక్క మాటలో చెప్పిన శ్రీ లీల!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీలీల పంచుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉస్తాద్ టీమ్ గురించి ఆమె చెప్పిన "మాస్" డెఫినేషన్లు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. సినిమా కోసం ఆమె చేసిన త్యాగాలు, థియేటర్లలో చూడాలనుకుంటున్న సందడి గురించి శ్రీలీల ఎంతో ముచ్చటగా వివరించింది.
ఎవరి స్టైల్ ఏంటో చెప్పేసిన లీలా:
సినిమా టీమ్ గురించి శ్రీలీల ఒక్క మాటలో వివరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ ని 'మాస్' అని, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన 'మాస్ క్లాస్‌కు బాస్' అని కొనియాడింది. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్‌ను 'ఫుల్ మాస్' అని, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను కూడా 'మాస్' అని చెప్పేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో రవి గారిని 'మాస్' అని, నవీన్ గారిని 'క్లాస్ గా కనిపించే మాస్' అని వెరైటీగా వర్ణించింది. ఇక తన తోటి హీరోయిన్ రాశీ ఖన్నాను 'క్లాస్' అని, తన గురించి మాత్రం అది టైమ్‌ని బట్టి మారుతుందని సరదాగా బదులిచ్చింది.
ఉస్తాద్ కోసం భారీ త్యాగం:
ఇక ఈ సినిమా కోసం శ్రీలీల చాలా ప్రాజెక్టులు వదులుకుందన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చింది. అవును, ఇది నిజమే అని చెబుతూ.. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ కోసం అప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం వల్ల, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు వేరే సినిమాలకు కమిట్ అవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం చూస్తుంటే, ఈ మూవీలో ఆమె పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మాస్ థియేటర్ లో పేపర్ల సందడి:
శ్రీలీల ఈ సినిమాను ఖచ్చితంగా మాస్ థియేటర్లోనే చూడాలని కోరుకుంటోంది. తన మొదటి సినిమా 'పెళ్లి సందడి' రిలీజ్ అప్పుడు ఫ్యాన్స్ థియేటర్లో ఎగరేసిన కాగితపు ముక్కలను కొన్నింటిని మెమొరీగా దాచుకుందట. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు కూడా ఫ్యాన్స్ చేసే రచ్చను చూస్తూ, ఆ పేపర్లను జ్ఞాపకంగా దాచుకోవాలని ఆమె అనుకుంటున్నట్టు తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ వింటేజ్ మాస్ అవతార్ చూడటానికి ఆమె కూడా ఒక సామాన్య అభిమానిలా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం మరో ప్రధాన బలం. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ వేట మొదలైనట్టే కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో వెండితెరపై ఈ మాస్ జాతర మొదలుకానుంది. ఉగాది కానుకగా రాబోతున్న ఈ చిత్రం పవన్ అభిమానులకు పండగ ముందే తెచ్చేలా ఉంది.