సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ని డీఎంకే బెదిరించిందా?

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ అరంగేట్రంపై టీవీకె నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌కు తెర‌తీసింది.;

Update: 2026-03-17 09:48 GMT

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ అరంగేట్రంపై టీవీకె నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌కు తెర‌తీసింది. ఈ వివాదంపై తాజాగా ర‌జ‌నీకాంత్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల్ని వ‌ట్టి పుకాఆర్లేన‌ని కొట్టిపారేశారు. అన్నింటికీ కాల‌మే స‌మాధానం చెబుతుంద‌న్నారు. వివారాల్లోకి వెళితే..స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఆద‌వ్ అర్జున ఇటీవ‌ల ఓ కార్యక్ర‌మంలో మాట్లాడుతూ ర‌జ‌నీకాంత్ రాజకీయ అరంగేట్రంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

ఆయ‌న రాజకీయాల్లోకి ప్ర‌వేశించేందుఉ ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో డీఎంకే పార్టీ ఆయ‌న‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విష‌యంలో తాను న‌టుడిపై విమ‌ర్శ‌లు చేయాల‌నుకోవ‌డం లేద‌ని, ఇలాంటి ఒత్తిళ్ల‌కు త‌మ నేత విజ‌య్ త‌లొగ్గ‌ర‌ని చెప్ప‌డ‌మే త‌న ఉద్దేశ్య‌మ‌ని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను డీఎంకే పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండిచారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే టీవీకే నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ వివాదంపై ర‌జ‌నీకాంత్ అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

వ‌చ్చే నెల‌లో త‌మిళ‌నాడుతో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య తాజా వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేప‌థ్యంలోనే ర‌జ‌నీకాంత్ ఈ వివాదంపై త‌న‌దైన స్టైల్లో కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన ప్రెస్ నోట్‌ని షేర్ చేశారు. `టీవీకెలో ఉన్న‌త స్థాయిలో ఉన్న ఒక నేత నాపై చేసిన వ్యాఖ్య‌లు అబ‌ద్దం. ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ నాకు మ‌ద్దుతుగా నిలిచిన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు, మీడియా మిత్రులు. అభిమానులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నా.

ఈ విష‌యంలో నేను చెప్పేది ఒక్క‌టే. కాలం మాట్లాడ‌క‌పోవచ్చు కానీ స‌రైన స‌మ‌యంలో అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమిస్తుంది` అని త‌న పోస్ట్‌లో స్ప‌ష్టం చేశారు. 2021 త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు ముందు ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌నుకున్నారు. దీనిపై పెద్ద ప్ర‌చార‌మే జ‌రిగింది. `ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం` అనే పేరుని పార్టీకి పెడుతున్న‌ట్టుగా వార్త‌లు షికారు చేశాయి. అయితే అనూహ్యంగా ర‌జ‌నీ రాజ‌కీయ అరంగేట్రానికిసంబంధించ‌యిన ప‌నుల‌ని అర్థాంత‌రంగా నిలిపివేసి అభిమానులుకు షాక్ ఇచ్చారు.

త‌ను ఎలాంటి రాజ‌కీయ పార్టీని స్థాపించ‌డం లేద‌ని, రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో అస‌లు ఏం జ‌రిగింది? ర‌జ‌నీ ఎందుకిలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు? అని అంతా అవాక్క‌య్యారు. ఉన్న‌ట్టుండి ర‌జ‌నీ రాజ‌కీయ అరంగేట్రాన్ని నిలిపి వేయ‌డం, రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌టం ప్ర‌తి ఒక్క‌రినీ షాక్‌కు గురి చేసింది. ఈ నేప‌థ్యంలోనే టీవీకే నేత చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌ధాన్యం సంత‌రించుకున్నాయి. ఈ ప్ర‌చారాన్ని బ‌ట్టి ర‌జ‌నీని నిజంగానే డీఎంకే వ‌ర్గాలు భ‌య‌పెట్టాయా? అందుకే ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని ర‌జ‌నీ ఒప్పుకున్నారా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.



Tags:    

Similar News