'ఆన్ ద స్పాట్‌లోనే షూటింగ్'.. పవన్ కళ్యాణ్ స్టైల్‌పై శ్రీలీల

పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టైల్, హరీష్ శంకర్ గ టేకింగ్ గురించి ఆమె చెప్పిన విషయాలు వింటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.;

Update: 2026-03-17 12:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, చిత్ర కథానాయిక శ్రీలీల పంచుకున్న సెట్ ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టైల్, హరీష్ శంకర్ గ టేకింగ్ గురించి ఆమె చెప్పిన విషయాలు వింటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.

ముందుగా స్క్రిప్ట్ పేపర్లే లేవు:

సాధారణంగా ఏదైనా సినిమా షూటింగ్‌కు వెళ్లేముందు నటీనటులకు డైలాగ్స్ ఉన్న పేపర్లు ఇస్తారు. కానీ 'ఉస్తాద్' సెట్‌లో మాత్రం అంతా రివర్స్‌లో జరిగిందట. "షూటింగ్ మొత్తంలో నాకు ఒక్కసారి కూడా ముందే స్క్రిప్ట్ కానీ, డైలాగ్ పేపర్ కానీ ఇవ్వలేదు. ఇక అంతా ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే జరిగిపోయేది" అని శ్రీలీల ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. హరీష్ శంకర్ కి ఫ్యాన్స్ కి ఏం కావాలో బాగా తెలుసని, అందుకే అప్పటికప్పుడు డైలాగ్స్ రాస్తూ పవన్ ఎనర్జీని సరిగ్గా వాడుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

ఫ్యాన్స్ కోసం ఏదైనా చేసే పవన్:

పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా రిజర్వ్‌డ్ గా, మొహమాటంగా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అభిమానుల కోసం ఆయన తన స్వభావాన్ని కూడా పక్కన పెడతారట. సెట్‌లో ఏదైనా మాస్ సీన్ చేయడానికి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, హరీష్ శంకర్ వచ్చి ‘సార్.. ఇది ఫ్యాన్స్ కోసం’ అని ఒక్క మాట అంటే చాలు.. పవన్ వెంటనే ఓకే చెప్పేసి ఆ సీన్ చేసేవారట. అభిమానుల పట్ల ఆయనకు ఉన్న ఆ అంకితభావం చూసి తాను ఫిదా అయ్యానని శ్రీలీల ఎమోషనల్ అయ్యింది.

పవన్ నుంచి నేర్చుకున్న పాఠాలు:

షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తనను ఎంతో ప్రోత్సహించారని శ్రీలీల తెలిపింది. చిన్న చిన్న విషయాలను కూడా ఆయన అప్రిషియేట్ చేసేవారని, ఆ హుందాతనం చూసి చాలా నేర్చుకున్నానని చెప్పింది. ఇక షూటింగ్ గ్యాప్‌లో ఆయన మొక్కల గురించి, ప్రకృతి గురించి ఎంతో ఆసక్తిగా అడిగేవారట. ఇక పవన్ తో మొదటి షాట్ చేసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని, ఆయన పక్కన నటించడం తన కెరీర్‌లో ఒక గర్వించదగ్గ మైలురాయి అని శ్రీలీల పేర్కొంది. ఆయనతో డ్యాన్స్ చేయడం గురించి అడిగితే.. అదొక సస్పెన్స్ అన్నట్టుగా బదులిచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్, థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, పవన్ కళ్యాణ్ వింటేజ్ మాస్ లుక్‌ను గుర్తుకు తెస్తుందని శ్రీలీల మాటలను బట్టి అర్థమవుతోంది. ఇక రేపు థియేటర్లలో పవర్ స్టార్ తన మేనరిజమ్స్‌తో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తారో చూడాలి. మెగా ఫ్యాన్స్‌కు ఇది పక్కా ఉగాది ట్రీట్ అని చెప్పవచ్చు.







Tags:    

Similar News