గీతా ఆర్ట్స్ తో GMB జాయింట్ వెంచ‌ర్

Update: 2020-02-18 06:45 GMT
ప‌రిశ్ర‌మ‌లో కాంబినేష‌న్స్ ట్రెండ్ ఎప్ప‌టినుంచో ఉన్న‌దే. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఇదో ఇంపోర్ట్ క‌ల్చ‌ర్. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు క‌లిసిక‌ట్టుగా జాయింట్ వెంచ‌ర్లు ప్లాన్ చేయ‌డ‌మే గాక‌.. భారీ పాన్ ఇండియా చిత్రాల్ని నిర్మిస్తున్నాయి. ఈ ఫార్ములా టాలీవుడ్ లో పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుట్ అవుతోంది. యువి క్రియేష‌న్స్ - జీఏ2 సంస్థ‌లు క‌లిసి సినిమాలు చేస్తున్నాయి. గీతా ఆర్ట్స్ - హారిక హాసిని క్రియేష‌న్స్ ఇటీవ‌ల క‌లిసి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించాయి. అలాగే శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ .. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సైతం ఇత‌ర బ్యాన‌ర్ల‌ను క‌లుపుకుని భారీ సినిమాలు చేస్తున్నాయి.

ఇక ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ సొంత బ్యాన‌ర్ జీఎంబీ ఇత‌ర అగ్ర బ్యాన‌ర్ల‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త్వ‌ర‌లోనే ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ బాబు ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ అల్లు అర‌వింద్ కి చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ గీతా ఆర్ట్స్ తో క‌లిసి వ‌రుస‌గా సినిమాలు నిర్మించ‌నుంది. తొలిగా కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో క‌లిసి వ‌ర్క్ చేయ‌నున్నార‌ని ఓ గుసగుస వినిపిస్తోంది. ప్ర‌శాంత్ నీల్ వినిపించిన లైన్ న‌చ్చిన మ‌హేష్ వెంట‌నే అత‌డిని అల్లు అర‌వింద్ వ‌ద్ద‌కు పంపించార‌ని చెబుతున్నారు. అంటే గీతా ఆర్ట్స్ అధినేత ఓకే చేస్తే క‌లిసి సినిమా చేయాల‌న్న ప్ర‌తిపాద‌న పంపిన‌ట్టేన‌ని భావిస్తున్నారు.

అంటే గీతా ఆర్ట్స్ తో జీఎంబీ టైఅప్ ఫిక్స‌యిన‌ట్టేన‌న్న‌మాట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఓ క్రేజీ ప్రాజెక్టుకు తెర లేచిన‌ట్టే. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్ ని తెర‌కెక్కిస్తున్నారు. ఆ సినిమా అనంత‌రం మ‌హేష్ తో సినిమా చేసే వీలుంద‌ని భావిస్తున్నారు. లైన్ వినిపించి ఇంప్రెస్ చేశాడు కాబ‌ట్టి పూర్తి స్క్రిప్టును రెడీ చేయాల్సి ఉంటుంది. ఈలోగానే మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లితో సినిమా పూర్త‌వుతుంది. అటు పై మ‌హేష్ 28 ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. మ‌హేష్ జీఎంబీ సంస్థ‌ ఇంత‌కుముందు `మ‌హ‌ర్షి` మూవీ కోసం దిల్ రాజుతో.. స‌రిలేరు నీకెవ్వ‌రు కోసం అనీల్ సుంక‌ర‌- దిల్ రాజు బృందంతో టైఅప్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక‌ పై గీతాధినేత‌కు ఆ ఛాన్స్ ద‌క్కింద‌న్నమాట‌.
Tags:    

Similar News