విశాల్ 'చక్ర'కు గుడ్ న్యూస్ చెప్పిన మద్రాస్ కోర్టు..!

Update: 2021-02-18 15:01 GMT
సినీహీరో విశాల్ నటించిన తాజా చిత్రం చక్ర. ఈ సినిమా విడుదల విషయంలో మద్రాస్ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. చక్ర సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టే సినిమా విడుదలను ఆపుతుందని అంతా భావించారు. అభిమన్యుడు తర్వాత విశాల్ నుండి వస్తున్న థ్రిల్లర్ మూవీ చక్ర. యాక్షన్ సినిమా వచ్చి ప్లాప్ అయింది. కానీ అభిమన్యుడు మూవీ బ్యాంకు లావాదేవీలు, సైబర్ మోసాల నేపథ్యంలో రూపొంది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. అయితే తాజాగా చక్ర సినిమాను నూతన దర్శకుడు ఎంఎస్ ఆనందన్ తెరకెక్కించాడు.

ఈ సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నేపథ్యంలో రూపొందించబడింది. ఇప్పటికే ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన చక్ర మూవీకి హైకోర్టు స్టే విధించడంతో చిత్రబృందం అంతా షాక్ లో ఉండిపోయారు. చక్ర సినిమాకు ఫస్ట్ నుండి వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు వస్తుందని విడుదల తేదీ ప్రకటించాడు. అయితే ఈ సినిమా అనుకున్న సమయంలోనే విడుదల కాబోతుందని ఈరోజు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు విశాల్. ఎందుకంటే మద్రాస్ కోర్టు స్టేను కొట్టివేయడంతో ఈ సినిమాకు దారి సుగమం అయింది. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని ఈ సినిమా విడుదల విషయంలో కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నిర్మాతకు మాత్రమే కాకుండా బృందం మొత్తానికి సంతోషాన్ని కలిగించిందని విశాల్ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ సినిమాలో శ్రద్ధశ్రీనాథ్, రెజినా కీలకపాత్రల్లో నటించారు.


Tags:    

Similar News