వర్మ కాకుండా మంచు లక్ష్మికి మరెవ్వరు దొరకలేదా?

Update: 2020-05-04 08:50 GMT
కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపుగా రెండు నెలలుగా సెలబ్రెటీలు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కొందరు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటే మరికొందరు మాత్రం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు టీవీ స్టూడియోలకు వెళ్లకుండానే మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. చర్చ కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తున్నారు. మరికొందరు సరదాగా ఇన్‌ స్టాగ్రామ్‌ లో లైవ్‌ లోకి వస్తున్నారు. నేడు మంచు లక్ష్మి కూడా ఇన్‌ స్టా లైవ్‌ లోకి రాబోతుంది. అయితే ఈమె రామ్‌ గోపాల్‌ వర్మతో కలిసి రావడం చర్చనీయాంశంగా మారింది.

భవిష్యత్తులో సినిమా ఎలా ఉండబోతుంది.. ఎలా ఉండాలనే విషయమై చర్చించేందుకు పలువురు సెలబ్రెటీలతో మంచు లక్ష్మి చర్చించబోతుందట. నేడు సాయంత్రం రామ్‌ గోపాల్‌ వర్మతో కలిసి లైవ్‌ లో ఈ విషయమై మాట్లాబోతున్నాను అంటూ మంచు లక్ష్మి ఇప్పటికే తెలియజేసింది. వర్మ ఏ చర్చ కార్యక్రమానికి వెళ్లినా కూడా అక్కడ రచ్చ చేయడం చాలా కామన్‌. మంచు లక్ష్మి చర్చించబోతున్న ఈ సీరియస్‌ టాపిక్‌ లో రామ్‌ గోపాల్‌ వర్మను ఇన్వాల్వ్‌ చేయడంను చాలా మంది తప్పుబడుతున్నారు.

ఈ చర్చను వర్మ సైడ్‌ ట్రాక్‌ పట్టించడంతో పాటు మొత్తం ఉద్దేశ్యంను చెడగొట్టే అవకాశం ఉంది. అలాగే వర్మ లైవ్‌ లో ఉంటే ఇతర సెలబ్రెటీలు కూడా జాయిన్‌ అవ్వడం అనుమానమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆయన చర్చ కార్యక్రామలు ఆయన మాటలు వినేందుకు జనాలు చాలా ఆసక్తి చూపించే వారు. కాని ఇప్పుడు వర్మ మాట్లాడే ప్రతి మాట పబ్లిసిటీ కోసమే అనే ఉద్దేశ్యంతో ఆయన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. కనుక మంచు లక్ష్మి నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. కొందరు మాత్రం చాలా ఆసక్తిగా ఆ లైవ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News