కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్.. అది తప్పు కాదేమో?
సినీ పరిశ్రమలో హీరో రేంజ్ అనేది ఒక్క రోజులో రాదు.. ఒక్క హిట్ తో కాదు.. వరుస విజయాలతోనే మార్కెట్ పెరుగుతుంది.;
సినీ పరిశ్రమలో హీరో రేంజ్ అనేది ఒక్క రోజులో రాదు.. ఒక్క హిట్ తో కాదు.. వరుస విజయాలతోనే మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే పారితోషికం కూడా పెరగడం సహజమే. ప్రస్తుతం ఇదే పరిస్థితి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విషయంలో కనిపిస్తోంది. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కూడా మారింది.
నిజానికి చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కంటెంట్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పెద్ద సెట్స్, స్టార్ క్యాస్టింగ్ కంటే కంటెంట్ బలంగా ఉండే కథలనే ఎక్కువగా ఎంచుకుంటూ వచ్చారు. దీనితో ఆయనకు మంచి గుర్తింపుతో పాటు నిర్మాతల్లో నమ్మకాన్ని కూడా పెంచింది.
ఇటీవల విడుదలైన క, కే ర్యాంప్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద లాభాలు తెచ్చిపెట్టడంతో కిరణ్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో కిరణ్ సినిమా అంటే కనీసం ఇన్వెస్ట్మెంట్ తిరిగి వస్తుందనే ఫీలింగ్ నిర్మాతల్లో పెరిగిందట.
ఆ హిట్స్ ఎఫెక్ట్ ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ పైనా పడిందని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కిరణ్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కుదుర్చుకున్న ప్రాజెక్ట్ కు కూడా ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సినీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే హిట్స్ వస్తే హీరోకు డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ కు తగ్గట్టే పారితోషికం పెరగడం కామన్. నిర్మాతలకు లాభాలు తీసుకురాగల హీరోకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం తప్పు కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మార్కెట్ ప్రకారం ఇది అందరి విషయంలో జరిగేదే అని చెబుతున్నారు.
అదే సమయంలో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఆ ప్రాజెక్ట్ కూడా హిట్ అయితే ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఏదేమైనా తన హార్డ్ వర్క్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు స్టేబుల్ ప్లేస్ ను సంపాదించుకుంటున్నారు. వరుస విజయాలు కొనసాగితే స్టార్ హీరోల సరసన నిలబడటం ఇంకా ఎన్ని రోజుల దూరంలో లేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆయన అప్ కమింగ్ సినిమాలపైనే ఉంది.