ధురంధ‌ర్ వ‌ర్సెస్ టాక్సిక్ పైచేయి ఎవ‌రిది?

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా రా అండ్ ర‌స్టిక్ స్టైల్లో ఆదిత్య‌ధ‌ర్ రూఊపొందించిన ఈ స్పై యాక్ష‌న్ డ్రామా గ‌త ఏడాది విడుద‌లై రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే;

Update: 2026-02-23 09:09 GMT

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బాలీవుడ్ మూవీ `ధురంధ‌ర్‌`. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా రా అండ్ ర‌స్టిక్ స్టైల్లో ఆదిత్య‌ధ‌ర్ రూఊపొందించిన ఈ స్పై యాక్ష‌న్ డ్రామా గ‌త ఏడాది విడుద‌లై రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. సైలెంట్‌గా ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా రానున్న `ధురంధ‌ర్ 2`పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ఇండియా - పాకిస్థాన్ నేప‌థ్యంలో రూపొందిన స్పై యాక్ష‌న్ డ్రామా కావ‌డం, ఫ‌స్ట్ పార్ట్‌లో షాకింగ్ విష‌యాల్ని వెల్ల‌డించ‌డంతో పార్ట్ 2పై వ‌ర‌ల్డ్ వైడ్‌గా అంద‌రిలోనూ ఈ సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ నేఫ‌థ్యంలో ఈ మూవీని మార్చి 19న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. స‌రిగ్గా ఇదే రోజు రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన భారీ క్రేజీ మూవీ `టాక్సిక్‌` రిలీజ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత య‌ష్ ఈ మూవీలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

దీంతో ఈ సినిమాపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అంతే కాకుండా రీసెంట్‌గా విడుద‌లై టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని ప‌తాక స్థాయికి చేర్చింది. ఓ హాలీవుడ్ మూవీని చూస్తున్న ఫీల్‌ని క‌లిగించ‌డంతో య‌ష్ `టాక్సిక్‌` కూడా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ రెండు సినిమాల్లో పైచేయి సాధించేది ఎవ‌రు? ఏ సినిమా ఫ‌స్ట్ డే ఓపెనింగ్ క‌లెక్ష‌న్‌ల‌తో రికార్డు సృష్టించ‌బోతోంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే `ధురంధ‌ర్ 2`, టాక్సిక్ రిలీజ్ అవుతున్న థియేర్లు, ఓపెనింగ్ వ‌సూళ్ల‌కు సంబంధించిన లెక్క‌లు బ‌య‌టికొచ్చాయి.

ర‌ణ్‌వీర్ సింగ్ న‌టిస్తున్న `ధురంధ‌ర్ 2` వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇండియాలో 4000 స్క్రీన్‌ల‌లో రిలీజ్ అవుతుండ‌గా, య‌ష్ టాక్సిక్ మాత్రం అంత‌కు మించి అన్న‌ట్టుగా 5,500 స్క్రిన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. రెండు సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్న స్క్రీన్‌ల కౌంట్‌ని బ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాలు ఇలా ఉన్నాయి. `ధురంధ‌ర్ 2` దేశ వ్యాప్తంగా రూ.100 కోట్ల‌మేర ఓపెనింగ్ వ‌సూళ్ల‌ని రాబ‌డుతుంద‌ని, అదే స‌మ‌యంలో `టాక్సిక్‌` రూ.250 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

అంటే స్క్రిన్ కౌంట్‌ని బ‌ట్టి `ధురంధ‌ర్ 2`పై య‌ష్ `టాక్సిక్‌` ఓపెనింగ్ వ‌సూళ్ల ప‌రంగా పైచేయి సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే య‌ష్ ఖాతాలో మ‌రో తిరుగులేని రికార్డ్ వ‌చ్చి చేరిన‌ట్టేన‌ని ఇన్ సైడ్ టాక్‌. `టాక్సిక్‌`లో య‌ష్ రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. రాయ‌గా, టికెట్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ రెండు క్యారెక్ట‌ర్ల‌లో టికెట్ అత్యంత ప‌వ‌న్ ఫుల్‌గా, రూత్ లెస్‌గా సాగుతుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News