వెంకీ ఆలోచనలో లాజిక్ కనిపిస్తుందిగా!
టాలీవుడ్‌లో రీమేక్‌ల ట్రెండ్ ను ఒకప్పుడు సేఫ్ జోన్‌గా భావించేవారు. హిట్ అయిన సినిమా కథను తీసుకుని దాన్ని ఇక్కడి నటీనటులతో తెరకెక్కిస్తే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకముండేది.;
టాలీవుడ్‌లో రీమేక్‌ల ట్రెండ్ ను ఒకప్పుడు సేఫ్ జోన్‌గా భావించేవారు. హిట్ అయిన సినిమా కథను తీసుకుని దాన్ని ఇక్కడి నటీనటులతో తెరకెక్కిస్తే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకముండేది. కానీ గత రెండు మూడేళ్లుగా ఆ ఈక్వేషన్ మారిపోయింది. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ గతంలో తీసుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే దృశ్యం సిరీస్ నుంచి రెండు సినిమాలు రాగా, ఆ రెండు సినిమాలూ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలనీ తెలుగులో వెంకటేష్ తోనే రీమేక్ చేశారు. ఇప్పుడు మలయాళంలో దృశ్యం3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా తెలుగులో వెంకీతోనే చేయాలనే ప్లాన్స్ ఉన్నప్పటికీ, వెంకీ దానిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
మలయాళ వెర్షన్ థియేటర్లలో రిలీజైన కొన్నాళ్లకే ఓటీటీలో అందుబాటులోకి రానుండటంతో, అదే కథను మళ్లీ థియేటర్లలో చూడ్డానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇటీవల కాలంలో రీమేక్ సినిమాల పరిస్థితిని చూస్తే వెంకీ ఆలోచనలో లాజిక్ ఉందనిపిస్తుంది. భీమ్లా నాయక్ లాంటి కొన్ని రీమేక్స్ స్టార్‌డమ్ వల్ల మంచి ఓపెనింగ్స్ ను సాధించినా, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు మిక్డ్స్ టాక్ తో సరాసరి ఫలితాలకే పరిమితమైన సంగతి తెలిసిందే.
పైగా ఓటీటీలో ఆల్రెడీ చూసిన కథను మళ్లీ థియేటర్ కు వెళ్లి చూడాలనే ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో కూడా తగ్గిపోయింది. మరోవైపు వెంకీ కెరీర్ ను చూసుకుంటే, ఆయన రీమేక్‌లు చేసినా అందులో కూడా బాగానే సక్సెస్‌లు అందుకున్నారు. అయినప్పటికీ వెంకీ ప్రస్తుతమున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తో మంచి ఫామ్ లో ఉన్న వెంకీ, ప్రస్తుతం సేఫ్ గేమ్ కంటే ఫ్రెష్ కంటెంట్ అయితేనే బెటర్ అని, దాని వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం చేస్తున్న వెంకీ, అనిల్ రావిపూడితో తన తర్వాతి సినిమా కోసం చర్చలు జరుపుతున్నారని, సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తూ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావాలనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రీమేక్ కథతో రిస్క్ చేయడం కంటే, తన ఇమేజ్ కు తగ్గ ఎంటర్టైనర్ తో రావడమే బెటర్ అని వెంకీ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.