బాఫ్టా వేడుకల్లో అలియా అందాలు..
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ బాలీవుడ్ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. నేడు హాలీవుడ్ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకుంది.;
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ బాలీవుడ్ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. నేడు హాలీవుడ్ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకుంది.. అలాంటి ఈమె బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) అవార్డు వేడుకలలో సందడి చేసింది. ఫిబ్రవరి 22న జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రెజెంటర్ గా వ్యవహరించే అరుదైన గౌరవాన్ని అందుకుంది. తొలిసారి ఈ అంతర్జాతీయ వేడుకకు హాజరైన రెడ్ కార్పెట్ పై తన అందాలతో హొయలు పోయింది.
ముఖ్యంగా తన గ్లామర్ టచ్ తో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ. బాఫ్టా 2026 అవార్డు వేడుకల్లో భాగంగా ప్రముఖ డిజైనింగ్ సంస్థ గూచీ తయారుచేసిన కస్టమ్ సిల్వర్ సీక్విడ్ గౌన్ ధరించింది. ఈ డ్రెస్ రెడ్ కార్పెట్ పై ఈమె కాంతిని రెట్టింపు చేసిందనే చెప్పాలి. ఇక వెచ్చగా ఉండడానికి లైట్ ర్యాప్ ను కూడా జోడించింది. చక్కని జుట్టు.. మృదువైన మేకప్ తో తన స్టైలింగును చాలా సున్నితంగా డిజైన్ చేసుకుంది. లుక్ క్లాసిగా ఉన్నప్పటికీ సౌకర్యవంతమైన దుస్తులతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఇకపోతే తన అందాన్ని మరింత ఫుల్ ఫీల్ చేసుకోవడానికి బరువైన షిమ్మర్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఇంత పెద్ద అంతర్జాతీయ కార్యక్రమానికి తన అందంతో.. హుందాతనంతో అభిమానులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాఫ్టా వేడుకలకు సంబంధించిన ఆలియా లుక్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇకపోతే ఇదే వేడుకల్లో అలియా భట్ చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలియా భట్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి రావాలన్నది నా చిన్ననాటి కల. సినిమాల్లో నటించడం కోసమే నేను పుట్టానేమో అనిపిస్తుంది.. కెమెరా ముందు నిలుచున్నప్పుడు ఏదో తెలియని ఆనందం.. ఈ పరిశ్రమకు రావడం నిజంగా ఒక వరం.. నటన అనేది నా బాధ్యత...దానిపట్ల ఎప్పుడూ కూడా నేను కృతజ్ఞతతోనే ఉంటాను. సినిమాను ఎంజాయ్ చేయడానికి భాష అవసరం లేదు.. ఎందుకంటే సినిమాను నడిపించేది భాష కాదు భావోద్వేగం.. ముఖ్యంగా నా కుమార్తె రాహా నాలో ఎంతో స్ఫూర్తిని నింపుతోంది. నా పాటలకు తను డాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఆనందం మరింత రెట్టింపు అవుతుంది" అంటూ ఆలియా తెలిపింది. మొత్తానికైతే బాఫ్టా వేడుకల్లో తొలిసారి ప్రజెంటర్గా పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈమె అక్కడ తన అందంతో ఆకట్టుకుంది. అంతేకాదు సినిమాపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అలియా భట్.