టాలీవుడ్ లో మొదలైన పెళ్లి సందడి.. కొత్త బంధంలోకి అడుగుపెడుతున్న జంటలివే!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో రోజులుగా అభిమానులను ఊరిస్తూ వచ్చిన జంటలు ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నాయి.;

Update: 2026-02-23 08:23 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో రోజులుగా అభిమానులను ఊరిస్తూ వచ్చిన జంటలు ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ అలా మొదలైందో లేదో.. అప్పుడే సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలోనే ఏకంగా మూడు సెలబ్రిటీ జంటలు వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాయి . అభిమానుల ప్రేమకు ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతూ.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న ఆ జంటలు ఏవో ఇప్పుడు చూద్దాం..

పెళ్లి పీటలెక్కనున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న :

గత కొన్ని సంవత్సరాలుగా రహస్యంగా డేటింగ్ చేస్తూ.. తమ బంధాన్ని అధికారికం చేయకుండా వచ్చిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న.. ఎట్టకేలకు ఫిబ్రవరి 22న అభిమానులు ప్రేమగా పెట్టిన "విరోష్" అనే పదాన్ని స్వీకరిస్తూ.. వివాహ బంధం లోకి అడుగుపెడుతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లో అత్యంత సన్నిహితులు , కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. " ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" అంటూ అభిమానుల ప్రేమను స్వీకరిస్తూ.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు.. ఇక ఉదయపూర్ లో హెరిటేజ్ ప్యాలెస్ లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఈ ప్రైవేట్ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన సన్నహాలు కొనసాగుతున్నాయి.వివాహం ఫిబ్రవరి 26న జరిగితే , మార్చి 4వ తేదీన హైదరాబాద్ వేదికగా తాజ్ హోటల్లో రిసెప్షన్ జరగనుంది.ఈ కార్యక్రమానికి పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్న అల్లు శిరీష్..

ఇకపోతే ఈ ఏడాది ప్రధమార్ధంలో వివాహం చేసుకోబోతున్న మరో జంట అల్లు శిరీష్ - నయానికా రెడ్డి. గత రెండు సంవత్సరాలుగా ప్రేమాయణంలో మునిగితేలిన ఈ జంట గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఈ జంట ఇప్పుడు మార్చి 6వ తేదీన వివాహం చేసుకోవడానికి సిద్ధం అయిపోయారు. అప్పుడే అల్లు శిరీష్ ఇంట్లో పసుపు దంచే కార్యక్రమాలు కూడా పూర్తయిన విషయం తెలిసిందే. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి - సురేఖ కొణిదెల దంపతులను కలిసి మొదటి శుభలేఖ అందించిన అల్లు శిరీష్ .. ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసి వివాహ పత్రిక అందించారు. దీనికి తోడు పెళ్లికి ముందే అల్లు శిరీష్ దుబాయ్ యాచ్ లో ప్రైవేట్ గ్రాండ్ పార్టీ ఇవ్వగా.. అల్లు అర్జున్ హైదరాబాదులో సెలబ్రిటీల కోసం ప్రైవేట్ పార్టీ నిర్వహించారు..

పెళ్లికి సిద్ధమవుతున్న పునర్నవి భూపాలం..

ఇకపోతే వీరితోపాటు ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ , హీరోయిన్ పునర్నవి భూపాలం కూడా ఏడడుగులు వేయబోతోంది. మార్చి 20వ తేదీన అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ఏడు అడుగులు వేయబోతోంది. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాలను బయటపెట్టిన ఈమె.. తన లగ్నపత్రిక ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది . ఇలా ఈ మూడు జంటలు మరో కొన్ని రోజుల్లో వివాహం పేరుతో కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నారు.

Tags:    

Similar News