క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో గత్తర లేపుతున్న నిహారిక!
1997 జూలై 4న చెన్నైలో కర్ణాటకకు చెందిన కుటుంబంలో జన్మించిన ఈమె.. తన తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది.
నిహారిక ఎన్ ఎమ్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కంటెంట్ క్రియేటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈమె డిజిటల్ కంటెంట్ సృష్టికర్తగా తన కామెడీ కంటెంట్ తో మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. మెగా థీ స్టాలియన్, జోర్డాన్ పీలా, పద్మా లక్ష్మి లలో నటించి అందర్నీ ఆకట్టుకున్న నిహారిక నెట్ ఫ్లిక్స్ లో మంచి ప్రజాదరణ పొందిన సిరీస్ 'బిగ్ మౌత్' లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
1997 జూలై 4న చెన్నైలో కర్ణాటకకు చెందిన కుటుంబంలో జన్మించిన ఈమె.. తన తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఎప్పుడూ థియేటర్ పైనే మక్కువ పెంచుకున్న నిహారిక సినిమాలు, నాటకాల పట్ల మరింత ఆకర్షితురాలయ్యింది. పదవ తరగతి లోనే యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయమైన ఈమె.. ఆ తర్వాత తన వీడియోల ద్వారా ఇంటర్నెట్లో తన భావాలను వ్యక్తపరచడం మొదలు పెట్టింది. ఇక ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది.
టైప్స్ అనే వీడియో సీరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక, యూట్యూబ్ తోనే కెరియర్ మొదలు పెట్టి.. 2024 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. 2024 మే 14 నుండి 2024 మే 25 వరకు జరిగిన 77వ వార్షిక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఇండియా తరఫున కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ఎన్నికయి ఒక్కసారిగా అందరి చూపును తన వైపు తిప్పుకుంది.
ఇక అలాంటి ఈమె తాజాగా గత కొద్ది రోజులుగా తమిళ్ చిత్రాలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జూలై 10వ తేదీన విడుదలైన ఇదయం మురళిలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అధర్వ మురళి, కాయాదు లోహర్ , ప్రీతి ముకుందన్ లతో పాటు కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రస్తుతం హిందీలో రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ కామెడీ డ్రామా మూవీ 'భాయ్ తేరా స్టార్ హై' అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. జూలై 30వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అటు ప్రమోషన్స్ మొదలుపెట్టింది నిహారిక. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది.
అందులో భాగంగానే తాజాగా నిహారిక ధరించిన ఈ అవుట్ ఫిట్ చూపరులను విపరీతంగా ఆకర్షించింది. ఇండో వెస్ట్రన్ ఫ్యూజన్ లుక్కులో స్టైల్ చేయబడిన ఏఎన్ఐ క్లోతింగ్ బ్రాండ్ వారి ఇన్నోచి డ్రెస్ ధరించింది.. ఇక టాప్ డిజైన్ విషయానికొస్తే .. నేవీ డెనిమ్ తో డిజైన్ చేసిన స్ట్రక్చర్ బాడీకి సొగసైన హాల్టర్ నెక్ లైన్ ని డిజైన్ చేశారు. ఇక టాప్ కింది భాగంలో స్ట్రక్చరల్ ప్లీటెడ్ ప్యానలింగ్ తో ఈ టాప్ డిజైన్ చేయడం జరిగింది. స్కర్ట్ విషయానికి వస్తే.. బ్లూ, వైట్ కాంబినేషన్ లో నైరూప్య టై - డై ప్రింట్ నమూనాతో దీనిని డిజైన్ చేశారు. నిహారిక తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ధరించిన ఈ మ్యాక్సీ డ్రెస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో కాటుక కళ్ళతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేసింది.