విజయ్ 'అసెంబ్లీ హ్యాండ్ గెస్చర్'.. సీఎం సాబ్ కొట్టడం పక్కానా?

టాలీవుడ్‌, కోలీవుడ్‌ లో సినిమాలు విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లు హాట్ టాపిక్ అవుతుంటాయి.

Update: 2026-07-22 05:27 GMT

టాలీవుడ్‌, కోలీవుడ్‌ లో సినిమాలు విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. కానీ ఈసారి మాత్రం ఒక హ్యాండ్ గెస్చర్ ఇప్పుడు చర్చకు దారితీసింది. తమిళనాడు అసెంబ్లీలో సీఎం జోసెఫ్ విజయ్ చేసిన హ్యాండ్ గెస్చర్ ఇప్పుడు జననాయగన్ సినిమాలో కూడా ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అఫీషియల్ క్లారిటీ లేకపోయినా, ఆ టాక్ మాత్రం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

అయితే విజయ్ నటించిన చివరి మూవీ జననాయగన్ విడుదలకు సిద్ధమైంది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ అయిన విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తోడు ఆయన అసెంబ్లీ హ్యాండ్ గెస్చర్ కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో విజయ్ చేసిన హ్యాండ్ గెస్చర్ నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అయింది.

గతంలో మాజీ సీఎం స్టాలిన్ గెస్చర్ ను విజయ్ రీక్రియేట్ చేయడం రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. సభలో డీఎంకే సభ్యులు లేకపోవడంతో స్పీకర్ అనుమతి తీసుకుని విజయ్ అలా చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు ఇదే హ్యాండ్ గెస్చర్ జననాయగన్ లో కూడా ఉంటుందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాకు సంబంధించి కొత్తగా కొన్ని సీన్స్ యాడ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అందులో ఆ అసెంబ్లీ గెస్చర్ కూడా ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ఎన్నో నెలలుగా సెన్సార్ సమస్యలను ఎదుర్కొన్న ఆ చిత్రం ఇటీవలే క్లియర్ అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) పలు మార్పులు సూచిస్తూ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మొత్తం 12 మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. రాజకీయ పార్టీలు, కొన్ని పదాలు, విజువల్స్‌ కు సంబంధించిన మార్పులు ఇందులో ఉన్నాయని తెలుస్తోంది.

ఇక సుమారు మూడు గంటల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాపై విజయ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నుంచి వస్తున్న చివరి సినిమా కావడంతో ఇది ఆయన కెరీర్‌ లో గుర్తుండిపోయే చిత్రంగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా యాక్ట్ చేస్తుండగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న జననాయగన్ దాదాపు 8,500 థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచగా, ఇప్పుడు ఆ అసెంబ్లీ హ్యాండ్ గెస్చర్ ఉంటుందనే ప్రచారం కూడా హైప్ పెంచింది. మరి నిజంగానే విజయ్ వైరల్ హ్యాండ్ గెస్చర్ సినిమాలో ఉంటుందా? ఉంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News