రావణాసురుడిగా సీఎం విజయ్.. అమ్మవారి గెటప్ లో త్రిష.. వైరల్ అవుతున్న బ్యానర్!
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా ప్రముఖ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం విజయ్.. ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష మధ్య ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా ప్రముఖ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం విజయ్.. ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష మధ్య ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఎన్ని రూమర్స్ వచ్చినా.. వీరు మాత్రం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు కొన్నేళ్ల వైవాహిక బంధాన్ని సంతోషంగా గడిపిన విజయ్ భార్య సంగీత కూడా ఒక నటి వల్లే తన భర్తకు తాను విడాకులు ఇస్తున్నట్లు కోర్టులో పిటిషన్ వేయడం కూడా సంచలనంగా మారింది. అయితే ఆ విషయంపై కూడా విజయ్ స్పందించలేదు. దీనికి తోడు కొంతమంది కోలీవుడ్ బడా సెలబ్రిటీలు కూడా విజయ్ - త్రిష రిలేషన్ పై ఇండైరెక్టుగా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. మధ్యలో త్రిష వాటిని ఖండించే ప్రయత్నం చేసినా.. విజయ్ ఏ రోజు స్పందించలేదు.
ఇకపోతే ఇప్పుడు సడన్గా తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా త్రిషతో రిలేషన్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది కాదు ఇవి రూమర్సే అంటూ కొట్టి పారేస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఈ జంటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వార్తలు వస్తున్న వేళ సడన్ గా తమిళనాడులో రోడ్డు పక్కన ఒక బ్యానర్ అందరి దృష్టిని ఆశ్చర్యానికి గురి చేసింది. పది తలల రావణాసురుడి గెటప్ లో విజయ్, అమ్మవారి గెటప్ లో త్రిష తో డిజైన్ చేసిన ఆ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఇద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ వస్తున్న వేళ సడన్గా ఈ కొత్త అవతారం ఏంటి ? అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ బ్యానర్ ఎక్కడ వెలిసింది? అసలు ఏంటి కథ?అనే విషయం ఇప్పుడు చూద్దాం.. అసలు విషయంలోకి వెళ్తే సేలం జిల్లా ఆత్తూర్ లోని మారియమ్మన్ గుడిలో ఆషాడ ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా అక్కడి యువత ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా యువత ఏర్పాటు చేసిన ఆ బ్యానర్ లో రావణాసురుడిగా విజయ్, అమ్మవారిగా త్రిష ఉన్నారు. ఇక ఈ బ్యానర్ కాస్త వైరల్ అవ్వడంతో పవిత్ర ఉత్సవాల్లోకి సినీ ప్రముఖులను తెస్తారా అని స్థానికులతో పాటు నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. ఇక ఇది కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ బ్యానర్ ను తొలగించి దీనికి కారణమైన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు.