బిగ్ బాస్ లో సీఎంపై కామెంట్సా? అసలు నిజమేంటి?
బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవలు, గేమ్స్, ఎమోషన్స్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు హోస్ట్ కామెంట్స్ కూడా పెద్ద చర్చకు దారితీస్తుంటాయి.
బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవలు, గేమ్స్, ఎమోషన్స్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు హోస్ట్ కామెంట్స్ కూడా పెద్ద చర్చకు దారితీస్తుంటాయి. ఇప్పుడు తమిళ బిగ్ బాస్ విషయంలో అదే జరిగింది. అయితే ఈసారి డిబేట్ కు కారణం.. హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్. అసలు ఆయన ఎవరినైనా టార్గెట్ చేశారా? లేక బిగ్ బాస్ లోని సందర్భంలో భాగంగానే మాట్లాడారా? అన్నదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ తమిళ్ సీజన్ 10కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విజయ్ సేతుపతి.. షోలో లీడర్ షిప్ గురించి మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు గ్యారంటీస్ ఇవ్వడం, ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకునేందుకు అపోజిషన్ టీమ్ పైకి నెట్టడం బెస్ట్ లీడర్ క్వాలిటీ కాదనే అర్థంలో ఆయన కామెంట్ చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో డిబేట్ కు కారణమయ్యాయి.
ఎందుకంటే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పాలిటిక్స్ లోకి వచ్చి తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తక్కువ టైమ్ లోని ఎన్నికల్లో గెలిచి సీఎంగా మారారు. దీంతో విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ ను విజయ్ కు, ఆయన పొలిటికల్ జర్నీకి లింక్ చేస్తూ కొందరు నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. విజయ్ ఫ్యాన్స్ కూడా అదే నిజమనుకుని ఫీల్ అయ్యారట!
దీంతో అసలు బిగ్ బాస్ లో ఏం జరిగిందోనని, సేతుపతి నిజంగానే పొలిటికల్ కామెంట్స్ చేశారో లేదోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. విజయ్ సేతుపతి బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న తన లిమిట్ ను దాటి ఎక్కడైనా ఒక పొలిటకల్ లీడర్ పేరు ప్రస్తావించినట్టు కనిపించలేదు. ఆయన మాట్లాడింది లీడర్ షిప్, రెస్పాన్సిబిలిటీ, ఎలక్షన్ గ్యారెంటీలు, సమస్యలను ఎదుర్కొనే విధానం వంటి విషయాలు గురించే. అంటే.. ఒక లీడర్ ఎలా ఉండాలనే యాంగిల్ లోనే సేతుపతి మాట్లాడినట్టుగా చూడొచ్చు. హోస్ట్ గా షోలో ఒక సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆయన మాట్లాడారని అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు.
ఇక డిబేట్ పెరగడంతో విజయ్ టీవీ ఛానెల్ కూడా రెస్పాండ్ అయింది. బిగ్ బాస్ కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అని క్లారిటీ ఇచ్చింది. షోలో జరిగే కన్వర్జేషన్లను బయట వ్యక్తులు, సంస్థలు లేదా రాజకీయాలతో లింక్ చేయడం సరికాదని చెప్పారు. అలా షోలో చేసే కామెంట్స్ ను వ్యక్తిగత విమర్శలుగా చూడొద్దని కూడా తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఉన్న విషయం చూస్తే.. విజయ్ ఎవరినైనా టార్గెట్ చేయలేదని చెప్పాలి. కేవలం షోలో లీడర్ షిప్ గురించి చేసిన కామెంట్స్ కు కొందరు పొలిటకల్ టచ్ ఇవ్వడంతోనే వివాదం మొదలైనట్టు కనిపిస్తోంది.