• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెండితెరపై హ్యాట్రిక్...

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

| తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రీల్ లైఫ్ జోడీలుగా అలరించి, ఆపై నిజజీవితంలో కూడా భార్యాభర్తలుగా మారి అందరినీ ఆకట్టుకున్నారు ఎంతోమంది సెలబ్రిటీలు.

By - Madhu Reddy
Update: 2026-11-02 19:30 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రీల్ లైఫ్ జోడీలుగా అలరించి, ఆపై నిజజీవితంలో కూడా భార్యాభర్తలుగా మారి అందరినీ ఆకట్టుకున్నారు ఎంతోమంది సెలబ్రిటీలు. అయితే అలాంటి సెలబ్రిటీలు వెండితెరపై అద్భుతమైన కెమిస్ట్రీతో వరుస విజయాలను అందుకొని అభిమానులను అలరించారు. అలాంటి జోడీలలో ప్రత్యేకించి కొన్ని జంటల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా వెండితెరపై తమ అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. హ్యాట్రిక్ అందుకొని రికార్డు సృష్టించారు. మరి అలా వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలు ఏవో ఇప్పుడు చూద్దాం.

అక్కినేని నాగార్జున - అమల:

దివంగత లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన నాగార్జున తనదైన నటనతో మాస్ హీరోగా, కింగ్ గా, మన్మధుడిగా ఇలా అభిమానుల చేత పిలిపించుకుంటూ అందరిని ఆకర్షించారు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ప్రముఖ సినీ నటి అమలను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే టాలీవుడ్ లో ఒకప్పటి మోస్ట్ రొమాంటిక్ రియల్ లైఫ్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట బాక్స్ ఆఫీస్ వద్ద కూడా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ కంటే కూడా ఎక్కువ హిట్లే అందుకోవడం గమనార్హం. అలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'శివ' మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా ట్రెండ్ సెట్టర్గా కూడా నిలిచింది. ఇక తర్వాత వచ్చిన 'కిరాయి దాదా' సూపర్ హిట్ గా నిలవగా, 'నిర్ణయం' సినిమా మంచి విజయం అందుకుంది అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో 'ప్రేమ యుద్ధం','చిన్నబాబు' వంటి చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

అక్కినేని నాగచైతన్య - సమంత:

నాగార్జున వారసుడిగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన అక్కినేని నాగచైతన్య.. తన భార్య సమంతకు విడాకులు ఇవ్వకముందు అద్భుతమైన కెమిస్ట్రీ తో వరుస విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా వీరు కలిసి నటించిన సినిమాలతో హ్యాట్రిక్ కూడా అందుకున్నారు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా 'ఏ మాయ చేసావే'. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 'మనం' చిత్రం బ్లాక్ బాస్టర్ కాగా, వివాహం తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మజిలీ' సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి 'ఆటో నగర్' సూర్య సినిమాలో కూడా కలిసి నటించారు.

శ్రీకాంత్ - ఊహ:

90వ దశకంలో శ్రీకాంత్ , ఊహాల కాంబినేషన్ వెండితెరపై ఒక వెలుగు వెలిగింది. వీరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆమె అల్లరి మొగుడు, కూతురు వంటి చిత్రాలు ఘనవిజయం సొంతం చేసుకున్నాయి.

రాజశేఖర్ - జీవిత:

రాజశేఖర్ - జీవితలది కూడా వెండితెరపై విజయవంతమైన కాంబినేషన్. పెళ్లికి ముందు, ఆ తర్వాత వీరు కలిసి చేసిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 'అంకుశం', 'మగాడు','ఆహుతి ' వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న:

అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో వెండితెరపై సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 'గీతాగోవిందం' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. ఇక వివాహం తర్వాత నటించిన 'రణబాలి' సినిమా కూడా మంచి విజయం అందుకుంది.

వీరితో పాటు మరికొన్ని జంటలు రియల్ జోడీలుగా గుర్తింపు తెచ్చుకొని.. అటు వెండితెరపై కూడా హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాయి.

Tags:    
  • vijaydeverakonda 
  • rashmikamandanna 
  • nagachaitanya 
  • samantharuthprabhu 
  • tollywood 

Similar News

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS