ఎవరికైనా అది కామన్.. ప్రభాస్ స్పీడ్ మాత్రం తగ్గేదేలే..
ఆ సీక్వెల్ ను ఇంకా గ్రాండ్ గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం ఇచ్చిన ఎక్స్పీరియన్స్ దృష్ట్యా రెండో పార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ ఎప్పుడూ భారీ అంచనాల మధ్యే సాగుతుంది. ఆయన సినిమా అంటే అభిమానులకు మాత్రమే కాదు, అందరిలో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్ పై భారీ హైప్, పెద్ద బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్.. ఇవి ఇప్పుడు ప్రభాస్ సినిమాలకు కామన్ అయిపోయాయి. అయితే ఇటీవల విడుదలైన ది రాజా సాబ్ మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
రిలీజ్ కు ముందు మంచి బజ్ వచ్చినా, థియేటర్లలో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. కథ, మేకింగ్ విషయంలో కొంత నిరాశ మిగిలిందనే అభిప్రాయాలు వినిపించాయి. దీంతో అభిమానులు కూడా మరింత మెరుగైన కంటెంట్ ఆశించారు. కానీ సినీ పరిశ్రమలో హిట్లు, ఫ్లాప్లు సహజం. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రతి మూవీ సూపర్ హిట్ అవుతుందనే గ్యారంటీ ఉండదు.
కావాలని ఎవరూ ఫ్లాప్ సినిమా చేయరు. కొన్ని సార్లు ప్లానింగ్ కంటే రిజల్ట్ భిన్నంగా వస్తుంది. అలాంటి సమయంలో వెనక్కి తగ్గకుండా మళ్లీ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళడమే నిజమైన స్టార్ లక్షణం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే అదే విషయం అర్థమవుతోంది. ఇప్పటికే భారీ విజయం సాధించిన కల్కి 2898 ఏడీ మూవీకి కొనసాగింపుగా కల్కి 2 ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
ఆ సీక్వెల్ ను ఇంకా గ్రాండ్ గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం ఇచ్చిన ఎక్స్పీరియన్స్ దృష్ట్యా రెండో పార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ఫౌజీ ప్రాజెక్ట్ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఆ సినిమా ప్రభాస్ ను కొత్త యాంగిల్ లో చూపిస్తుందనే టాక్ ఉంది. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వనుంది.
మరోవైపు స్పిరిట్ సినిమాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో, పవర్ ఫుల్ పాత్రలో కనిపించేందుకు ప్రభాస్ ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కతుండటంతో సినీ ప్రియులతోపాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంతా ఫిక్స్ అయ్యారు.
అయితే స్టార్ హీరోల సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉండటం సహజం. అదే సమయంలో ఒక్కసారి వచ్చే నిరాశ కూడా వారిని మరింత జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకునేలా చేస్తుంది. ఏదేమైనా రాజా సాబ్ రిజల్ట్.. ఆశించిన స్థాయిలో లేకపోయినా, ప్రభాస్ స్పీడ్ మాత్రం తగ్గలేదు. వరుస ప్రాజెక్టులతో ఆయన మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని సిద్ధమవుతున్నారు. సరైన కథ పడితే బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభాస్ అదరగొట్టడం ఖాయమని చెప్పడంలో నో డౌట్.