'స్పిరిట్' విలన్.. అసలు వంగా ప్లాన్ ఏంటి?

ఇటీవల వంగా ఒక సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా అభిమానులు స్పిరిట్ విలన్ గురించి ప్రశ్నించారు.;

Update: 2026-02-23 10:34 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ చిత్రంపై అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. షూటింగ్ మొదలవకముందే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలో విలన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం గత కొంతకాలంగా హాట్ టాపిక్‌ గా మారింది.

సినిమా అనౌన్స్ అయిన వెంటనే కొరియా యాక్షన్ స్టార్ మా డాన్ లీ (Don Lee) విలన్ గా కనిపిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. మొదట ఇది కేవలం గాసిప్‌ లా మొదలైనా.. ఆ తర్వాత అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. కొన్ని కొరియన్ మీడియా వర్గాలూ ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఆ రూమర్‌ కు మరింత బలం చేకూరింది. దీంతో స్పిరిట్ పై ఆసక్తి రెట్టింపైంది.

అయితే ఇంత హైప్ ఉన్నా.. మూవీ టీమ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఆ విషయంపై సరైన విధంగా స్పష్టత ఇవ్వలేదు. ఆయన మౌనం పాటించడం వల్ల అభిమానుల్లో సస్పెన్స్ ఇంకా పెరిగింది. నిజంగానే డాన్ లీ నటిస్తున్నారా? లేక ఇది కేవలం ప్రచారమేనా? అన్న డౌట్ అందరిలో నెలకొంది.

ఇటీవల వంగా ఒక సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా అభిమానులు స్పిరిట్ విలన్ గురించి ప్రశ్నించారు. కొందరు డాన్ లీని తీసుకోవాలని కూడా కోరారు. దీనికి వంగా నవ్వుతూ.. మీరు అనుకున్నట్టు జరుగుతుంది… అట్లానే అవుతుంది అని సమాధానం ఇచ్చారు. ఆ ఒక్క మాటే ఫ్యాన్స్‌ కు పెద్ద హింట్‌ గా మారింది. ఆయన మాటల్లోనే క్లారిటీ ఉందని భావించి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కానీ అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మార్చి 1న డాన్ లీ పుట్టినరోజు ఉండటంతో సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. ఆ రోజున ప్రత్యేక పోస్టర్ లేదా అధికారిక ప్రకటన రావచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. స్పిరిట్ టీమ్ ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందేమోనని అంచనా వేస్తున్నారు. మరి ఆ రోజు వరకు సస్పెన్స్ కొనసాగుతుందా? లేక క్లారిటీ వస్తుందా? అన్నది చూడాలి.

ఒకవేళ డాన్ లీ నిజంగా స్పిరిట్ లో యాక్ట్ చేస్తే మాత్రం సినిమాకు ఇంటర్నేషనల్ రేంజ్ లో హైప్ రావడం ఖాయం. ఇప్పటికే ప్రభాస్‌ కు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉంది. అలాంటి స్టార్‌ తో పాటు గ్లోబల్ యాక్షన్ ఇమేజ్ ఉన్న యాక్టర్ స్క్రీన్‌ పై కనిపిస్తే యాక్షన్ సీన్స్ మరో లెవెల్‌ లో ఉండే అవకాశం ఉంది. ఓవర్సీస్ ప్రేక్షకుల దృష్టి కూడా సినిమాపై పడుతుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News