వర్మ ఆ రెండు సినిమాలపై బుక్ రాస్తున్నాడా?
ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ బట్టలు చించుకున్నంత పని చేశారు. ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్విట్టర్‌లో ఓ భారీ పోస్ట్‌ని షేర్ చేశాడు.;
వివాదాస్పద ట్వీట్లతో నిత్యం నెట్టింట వైరల్ అవుతున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక వర్మ మాత్రమే. అంతా సినిమాలతో వైరల్ అవుతుంటో వర్మ మాత్రం ట్వీట్‌లతో వైరల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. డైరెక్టర్‌గా వర్మ క్రేజ్ తగ్గినా కానీ ట్వీట్‌లతో తానింకా లైమ్ లైట్‌లోనే ఉన్నానంటూ అందరికీ తన ఉనికిని గుర్తు చేస్తూ వస్తున్నారు. ఈ ట్వీట్టర్ ఖాతా మొదలు పెట్టిన దగ్గరి నుంచి ఎవరూ స్పందించని రేంజ్‌లో రామ్ గోపాల్ వర్మ రెండు సినిమాలపై స్పందించాడు...సారీ స్పందించాడనడం కంటే ట్విట్టర్‌లో మిని బుక్కే శాస్తున్నాడని చెప్పొచ్చు.
బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల కాంబినేషన్‌లో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్`. గత డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్‌తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. క్రమ క్రమంగా బాక్సాఫీస్ వద్ద బలపడుతూ ఫైనల్‌గా షాకింగ్ కంటెంట్, ఆకట్టుకునే మ్యూజిక్‌తో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1340 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది.
రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ మూవీపై ప్రముఖులు, విమర్శకులు స్పందించి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ బట్టలు చించుకున్నంత పని చేశారు. ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్విట్టర్‌లో ఓ భారీ పోస్ట్‌ని షేర్ చేశాడు. ఓ మిని బుక్‌ల అందరిని ఆశ్చర్యపరిచింది. దర్శకుడు ఆదిత్యధర్‌కు మించి సినిమాని ఓన్ చేసుకుని ప్రచారం చేశారు. నెట్టింట సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇదే సందర్భంగా `టాక్సిక్`పై కూడా స్పందించారు. ఫస్ట్ వీడియో రిలీజ్ అయిన సందర్భంలో ప్రశంసలు కురిపించిన వర్మ `ధురంధర్ 2`, టాక్సిక్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తన స్టాండ్ ఏంటో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మరో లాంగ్ ట్వీట్‌ని షేర్ చేసిన వర్మ తన సపోర్ట్ `ధురంధర్ 2`కే అని క్లారిటీ ఇచ్చాడు. `ధురంధర్ 2`
పై ప్రశంసలు కురినిస్తూ ఇది మేధావుల సినిమా అని పొగుడుతూనే `టాక్సిక్`ని తక్కువ చేసి చూపించారు. టాక్సిక్ చూసే వాళ్లు అమాయకులని, మాస్ ఫోబియా ఉన్నావాళ్లని కామెంట్‌లు చేశారు.
ఎన్నడూ లేని విధంగా వర్మ ఈ రెండు క్రేజీ సినిమాలపై నెట్టింట చాంతాడంత ట్వీట్‌లు చేస్తుండటంతో వర్మ వీటిపై స్సెషల్ గా బుక్ ఏమైన ప్రిపేర్ చేస్తున్నాడా? అని నెటిజన్‌లు వాపోతున్నారు. ఎప్పుడూ ఈ స్థాయిలో సినిమాపై ట్వీట్‌లు చేయని వర్మ ప్రత్యేకించి `ధురంధర్`, ధురంధర్ 2, టాక్సిక్‌లపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతుండటం విడ్డూరంగా ఉందని, టాక్సిక్`ని తక్కువ చేసి చూపిస్తూ ఆయన ఏం కోరుకుంటున్నాడో అర్థం కావడం లేదని సెటైర్లు వేస్తున్నారు.