• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ఇద్దరి వల్ల కల్కి 2...

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

| టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన దాడి ఘటన, అమితాబ్ బచ్చన్‌కు జ్వరం రావడంతో ముంబైలో జరగాల్సిన రెండు షెడ్యూల్స్ రద్దైనట్లు సమాచారం.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-05 06:14 GMT

ప్రభాస్ సినిమా అంటే అభిమానుల్లో ఉండే అంచనాలు మామూలుగా ఉండవు. ముఖ్యంగా భారీ సినిమాల విషయంలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇప్పుడు కల్కి 2 విషయంలో మాత్రం అభిమానుల ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. దీంతో రాజమౌళి అనుకుంటే ఈ నాగ్ అశ్విన్ ఎక్కడ దొరకడు రా బాబు అంటూ ప్రభాస్ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

 

2024లో విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సినిమా చివర్లో రెండో భాగంపై భారీ అంచనాలు పెరిగాయి.

అయితే కల్కి రెండో భాగం షూటింగ్ మాత్రం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. మొదటి భాగం విడుదలైన తర్వాత దాదాపు రెండేళ్లకు రెండో భాగం షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు కూడా షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన దాడి ఘటన, అమితాబ్ బచ్చన్‌కు జ్వరం రావడంతో ముంబైలో జరగాల్సిన రెండు షెడ్యూల్స్ రద్దైనట్లు సమాచారం. తాజాగా నవంబర్ మధ్యలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, సాయి పల్లవి పాల్గొనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో అభిమానులు బాహుబలి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. 2015లో బాహుబలి మొదటి భాగం విడుదల కాగా, 2017లో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా మొదటి భాగం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రెండో భాగానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. అందుకే కథను కొనసాగించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

కల్కి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. బాహుబలి రెండు భాగాల మధ్య రెండేళ్ల సమయం ఉండగా, కల్కి రెండో భాగం షూటింగ్ ప్రారంభించడానికే ఎక్కువ సమయం పట్టింది.

అయితే కల్కి సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, అనేక పాత్రలు ఉండటంతో సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు.

Tags:    
  • prabhas 
  • kalki2898ad 
  • kalki2 
  • nagashwin 
  • baahubali 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS