• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వేటపాలెంలో క్రాక్...

వేటపాలెంలో క్రాక్ డైరెక్టర్.. నటసింహ వేట కోసమేనా..?

By - Tupaki Desk
Update: 2021-04-14 13:30 GMT
మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ ఏడాది ప్రారంభంలో మాస్ మహారాజా రవితేజతో ''క్రాక్'' సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు - గుంటూరు ప్రాంతాల్లోని రియల్ క్యారక్టర్స్ తీసుకుని ఈ కాప్ డ్రామాని తెరకెక్కించాడు గోపీచంద్. ఈ సినిమా ఎక్కువ భాగం తన స్వస్థలమైన ప్రకాశం జిల్లాలోని వేటపాలెం - ఒంగోలు - చీరాల - చీమకుర్తి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. అయితే మలినేని గోపీచంద్ ఇప్పుడు మరోసారి తన సినిమా కోసం వేటపాలెం చేరుకున్నాడు. అక్కడ 100 ఏళ్ల క్రితం నాటి సారస్వత నికేతనం అనే పురాతనమైన లైబ్రరీలో సమయం గడుపుతున్నాడు.

వేటపాలెం లైబ్రరీలో కూర్చొని గోపీచంద్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ ని తిరగేస్తున్నాడు. దీనిని బట్టి చూస్తే తదుపరి సినిమా కూడా వాస్తవ సంఘటన ఆధారంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. 'క్రాక్' డైరెక్టర్ నెక్స్ట్ మూవీ నటసింహం నందమూరి బాలకృష్ణ తో చేయనున్నాడనే విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ - ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్న గోపీచంద్ మలినేని.. బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే వేటపాలెం లైబ్రరీలో పాత వార్తాపత్రికలను తిరగేస్తున్నాడని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ''అఖండ'' షూటింగ్ పూర్తయిన వెంటనే గోపీచంద్ సినిమా స్టార్ట్ చేస్తాడని సమాచారం.
Tags:    
  • Gopichand Malineni 
  • Latest News 
  • Tollywood 
  • Balakrishna 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS