కోటకు ఇంకా ఓపిక ఉందట
నటుడిగా కోట శ్రీనివాసరావు చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. వందల సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు వయసు పెరగడంతో మునుపటి స్థాయిలో సినిమాల్లో కనిపించడం లేదు. దర్శకులు ఆయన్ను కనీసం పరిగణలోకి తీసుకోవడం మానేశారు. ఎన్నో ఏళ్ల పాటు సినిమాలు చేస్తూ ఉన్న కోట కు ఇప్పుడు సినిమాలు చేయకుండా ఊరికే ఉండాలనిపించడం లేదట. తన శక్తి మేరకు ఏదో ఒక పాత్రను చేయాలని తాపత్రయ పడుతున్నాడు.
సినిమాల్లో ఇంకా నటించాలనే కోరిక ఉన్నప్పటికి ఆఫర్లు రావడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నాడు. తనలో ఇంకా ఓపిక ఉందని షూటింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నాడు. పరిచయం ఉన్న దర్శకులను అవకాశాలు ఇవ్వాలంటూ కోరుతున్నట్లుగా పేర్కొన్నాడు. డబ్బు కోసం కాకున్నా ఖాళీగా ఉండటం కష్టంగా ఉందని అవకాశాలు అడుగుతున్నానంటూ కోట అంటున్నాడు.
73 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న కోట అవకాశాల కోసం దర్శకులకు విజ్ఞప్తి చేయడం ఆయన స్థాయిని తగ్గించుకోవడం అవుతుందని ఇండస్ట్రీలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే ఆయన మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్కోవడం తన వల్ల కావడం లేదని అంటున్నాడు. కోట ఇంత ఆసక్తి చూపిస్తున్నా దర్శకులు ఆయనకు తగ్గ పాత్రల్లో ఆఫర్లు ఇస్తారా చూడాలి.