చైతూలో ఆ క్వాలిటీస్ భేష్: కొరటాల
బలం ఏంటో బలహీనత ఏంటో తెలిసిన హీరో గొప్ప హీరో. అలాంటి క్వాలిటీ నాగచైతన్యలో ఉందని పొగిడేశారు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. తనలో బలం ఏంటో బలహీనత ఏంటో నాగచైతన్యకు బాగా తెలుసునని మజిలీ సక్సెస్ వేడుక సాక్షిగా అన్నారు. పోసాని సహా పలువురు చైతన్య నటనకు ఈ వేదికపై కాంప్లిమెంట్లు ఇచ్చారు. చైతన్యలో పరిణతి చెందిన నటుడు కనిపిస్తున్నాడని కితాబిచ్చారు.
కొరటాల శివ మాట్లాడుతూ ``చైతన్యను చూసినప్పుడు నాకు ఎప్పుడూ నిజాయితీ కనిపిస్తుంది. ఆయన బలాలు, బలహీనతలూ ఆయనకు తెలుసు. అంత నిజాయితీగా ఉంటారు కాబట్టే తన నటన గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో పూర్ణను చూస్తుంటే అలాంటి వ్యక్తి వైజాగ్ లో ఉన్నారేమో అనిపించింది`` అంటూ ప్రశంసించారు. ``చైతన్య మెయిన్ లీగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలో చైతూ- సమంత మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. మజిలీలో ఆవిడ చైతన్యను ఎలా చూసుకున్నారో, బయట కూడా ఆమె అలాగే చూసుకుంటున్నారని అనుకుంటున్నాను`` అన్నారు.
చైతన్య గురించి `ఎఫ్ 2` దర్శకుడు అనీల్ రావిపూడి సైతం తనదైన శైలిలో కాంప్లిమెంట్ ఇచ్చారు. పూర్ణ క్యారెక్టర్ చేసిన చైతన్య లో పూర్తి నటుడు కనబడ్డారు. ఆ పాత్రకు పూర్తిగా కనెక్టయిపోయాను. అంత బాగా చైతూ నటించారని కితాబిచ్చారు. నాగచైతన్యతో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ కుదరలేదు. సినిమా సినిమాకు తనదైన శైలిలో షైన్ అవుతున్నారని ప్రశంసించారు. మజిలీ సక్సెస్ వేదికపై సీనియర్ దర్శకరచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి సైతం నాగచైతన్య నటనను పొగిడేశారు. జోష్ లో బొమ్మలా ఉన్నావ్.. ఇప్పుడు దానమ్మలా ఉన్నావ్! అంటూ పొగిడేసిన సంగతి తెలిసిందే. తనకు కాంప్లిమెంట్లు ఇచ్చిన దర్శకులందరికీ థాంక్స్ చెప్పిన చైతూ ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనది అని సంతోషం వ్యక్తం చేశారు.