మరో విషాదం.. సీనియర్ కమెడియన్ గుండెపోటుతో మృతి!
ఒకే రోజున ఇద్దరు సినీ రంగ ప్రముఖులు కన్నుమూసిన విషాదం తాజాగా చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ప్రముఖ నటుడు.. దర్శకుడు.. రచయిత గిరీశ్ కర్నాడ్ కన్నుమూసిన వైనం తెలిసిందే. ఆయన మరణంతో సినీ రంగంతో పాటు.. పలువురు విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ సీనియర్ కమెడియన్ కేజ్రీ మోహన్ గుండెపోటుతో మరణించారు.
ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను దగ్గర్లోని కావేరి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను బతికించేందుకు ప్రయత్నించినా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మరణించిన విషయాన్ని వైద్యులు తెలిపారు.
నటుడిగా ఆయన పెద్ద ఎత్తున సినిమాల్లో పని చేశారు. అపూర్వ సహోదరులు.. మైకేల్ మదన కామరాజు.. సతీలీలావతి.. తెనాలి.. పంచతంత్రం.. కాదల కాదల.. భామనే సత్యభామనే.. వసూల్ రాజా ఎం.బి.బి.ఎస్ తదితర చిత్రాల్లో కామెడీ పాత్రల్లో నటించిన ఆయన ఆకట్టుకున్నారు.
కేజ్రీ తీవ్స్ ఇన్ పాలవాక్కం అనే నాటకం తర్వాత నుంచి ఆయన పేరు క్రేజీ మోహన్ గా ఫేమస్ అయ్యారు. వెన్ బా అనే ఏక వాక్య కవితలు రాయటం ఆయనకు అలవాటు. ఇప్పటివరకూ ఆయన 40వేల వెన్ బాలను రచించిన క్రెడిట్ ఆయన సొంతం. నాటక రంగానికి ఆయన చేసిన సేవ ఎంతో. ఆయన అకాల మరణంతో సినీ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.