ఫోటో స్టోరి: మషేష్ కొత్త హీరోయిన్ ఊరిస్తోంది

Update: 2017-04-20 05:06 GMT
మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ రిలీజ్ పై ఇంకా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. సినిమాకి సంబంధించి షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ లో ఉండడం.. గ్రాఫిక్ వర్క్ జోడించాల్సి ఉండడం.. అనుకున్న రిలీజ్ డేట్ కి ఇంకా 2 నెలలు మాత్రమే గడువు ఉండడంతో.. ఆ సమయానికి వస్తుందా రాదా అనే అనుమానాలున్నాయి. అయితే.. తర్వాతి సినిమా విషయంలో మాత్రం స్పీడ్ చూపిస్తున్నాడు మహేష్.

కొరటాల డైరెక్షన్ లో చేయనున్న చిత్రం కోసం ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు కూడా. జస్ట్ అనౌన్స్ మెంట్ మాత్రమే పెండింగ్ అంతే. ఇప్పటికే ఫగ్లీ.. ఎంఎస్ ధోనీ చిత్రాల్లో నటించిన ఈమె.. ప్రస్తుతం మెషీన్ అనే మూవీలో చేస్తోంది. పెర్ఫామెన్స్ తో పాటు గ్లామర్ షో విషయంలో కూడా అమ్మడు ఆచితూచి ప్రవర్తిస్తున్నట్లుగా ఉంటుంది. తాజాగా తన అఫీషియల్ సోషళ్ మీడియా పేజ్ లో.. ఊరించే అందాలతో ఓ ఫోటోను షేర్ చేసింది.

బ్యాక్ అందాలను.. బాహువుల వంపులను.. నడుం మెలికలను చూపిస్తూ దిగిన ఈ ఫోటోలో.. అమ్మడి అందమైన ఔట్ ఫిట్స్ కూడా ఆకట్టుకుంటాయి. కళ్లలో కనిపిస్తున్న మెరుపులు అసలైన ఆకర్షణ అనడంలో ఆశ్చర్యం లేదు కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News