శ్రీదేవి ప్రాపర్టీ ఇష్యూ... నెక్స్ట్ ఏంటి?
దివంగత నటి శ్రీదేవి ఫ్యామిలీకి చెందిన చెన్నై ఆస్తి వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరడం హాట్ టాపిక్ గా మారింది.
దివంగత నటి శ్రీదేవి ఫ్యామిలీకి చెందిన చెన్నై ఆస్తి వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరడం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ల్యాండ్ పై మరో ఫ్యామిలీ రైట్స్ కోరడంతో మొదలైన ఆ వివాదంలో.. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. ఇంతకీ శ్రీదేవి ఫ్యామిలీ ప్రాపర్టీ విషయంలో నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని భూమికి సంబంధించి ఎంసీ శివకామి, ఆమె బ్రదర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఆస్తిలో తమకు వాటా ఉందంటూ వారు గతంలో సివిల్ కేసు వేశారు. అయితే ఆ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో వారు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ పై జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రస్తుతం ఆస్తిపై ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగించాలని ఆదేశించింది. అలాగే శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కు నోటీసులు జారీ చేసింది.
అసలు వివాదం ఏంటి?
1988 ఏప్రిల్ 19న చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని భూమిని శ్రీదేవి కుటుంబం కొనింది. ఆ భూమికి సంబంధించి తర్వాత రైట్స్ లపై వివాదం మొదలైంది. ఆస్తిని అమ్మిన ఎంసీ చంద్రశేఖరన్ కుటుంబంలో తమకు కూడా హక్కు ఉందని శివకామి, ఆమె సోదరుడు వాదిస్తున్నారు. అయితే బోనీ కపూర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ దీనిపై వేరే వాదన వినిపించారు.
చాలా ఏళ్ల క్రితం జరిగిన ల్యాండ్ సేల్ వ్యవహారంలో 2023లో మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత సవాలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2025లో దాఖలైన ఆ కేసు టైమ్ పీరియడ్ దాటిపోయిందని వాదించారు. విచారణలో భాగంగా భూమిని అమ్మిన ఎంసీ చంద్రశేఖరన్ కు ఆస్తిలో ఐదో వంతు వాటా ఉందా అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. పిటిషనర్లు చంద్రశేఖరన్ పిల్లలేనా అనే అంశంపై కూడా వివరాలు అడిగింది.
ఆ వివాదాన్ని కోర్టు ద్వారా చాలా రోజుల పాటు కంటిన్యూ చేయడం కంటే.. రెండు వైపుల చర్చించుకుని సాల్వ్ చేసుకోవాలని సుప్రీంకోర్టు సజ్జెస్ట్ చేసింది. అవసరమైతే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని మీడియేటర్ గా ఏర్పాటు చేస్తామని తెలిపింది. అంటే ప్రస్తుతం శ్రీదేవి ఫ్యామిలీకి చెందిన ఆస్తిపై స్టేబుల్ పొజిషన్ కొనసాగనుంది. మరోవైపు ఇరువర్గాల మధ్య మీడియేషన్ ద్వారా సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం జరగనుంది.
ఆ ప్రాసెస్ లో ఇప్పుడు ఏం తేలుతుందనేది కీలకంగా మారింది. మీడియేషన్ ద్వారా ఉండే డెవలపెంట్ ను అబ్జర్వ్ చేసేందుకు సుప్రీంకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఆస్తిపై ఎలాంటి మార్పులు లేకుండా స్టేటస్ కో కొనసాగనుంది. ఆ తర్వాత ఏం జరగనుందో చూడాలి.