గూగుల్ ని షేకాడిస్తున్న బెబో బేబి బంప్ అవతార్

Update: 2020-12-15 03:31 GMT
అందాల క‌థానాయిక‌ల బేబి బంప్ ప్ర‌ద‌ర్శ‌న నిరంత‌రం అభిమానుల్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి. 2020లో ప‌లువురు భామ‌లు త‌మ గ‌ర్భ‌ధార‌ణ‌కు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు. బెబో క‌రీనాక‌పూర్ తాను రెండోసారి మ‌మ్మీ అవుతున్నాన‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ఓవైపు గర్భిణి అయినా క‌రీనా షూటింగుల్లో పాల్గొంటూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. తాజాగా కరీనా కపూర్ తన డైరీ నుండి కొంత సమయం సంపాదించగలిగింది. సోమవారం మధ్యాహ్నం తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో అద్భుతమైన ఫోటోని అభిమానుల కోసం పంచుకుంది. ఈ చిత్రంలో గులాబీ రంగు దుస్తులు ధరించిన బెబో బేబి బంప్ తో కెమెరాకి ఫోజులిచ్చింది.

`సెట్స్ లో మా ఇద్దరు.. ఏ సమయంలోనైనా`` అంటూ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఈ ఫోటోకి పెట్టింది బెబో. అభిమానుల నుండి గుండె ఎమోజీలతో స్పంద‌న అంతే ఇదిగా ఉంది. కరీనా స్నేహితురాలు  ఫ్యాషన్ డిజైనర్  మసాబా గుప్తా ఇలా వ్యాఖ్యానించారు. `ఫబ్బబ్బ్!`.. గర్భం ధ‌రించాకా మీరు ఎంత కష్టపడి పనిచేశారో పిచ్చి.. ప్రశంసనీయం అంటూ వ్యాఖ్యానించారు. కరీనా యొక్క గుడ్ న్యూజ్ సహనటి కియారా అద్వానీ ఈ పోస్ట్ ‌పై హార్ట్ ఎమోజీలను షేర్ చేయ‌గా .. అమృత అరోరా అద్భుతం అంటూ స్పందించింది.

గర్భధారణ సమయంలో కరీనా అమీర్ ఖాన్ తో కలిసి `లాల్ సింగ్ చద్దా` చిత్రీక‌ర‌ణ‌ను ముగించింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఫోటో షూట్స్ చేసింది. ఆమె టాక్ షో మూడవ సీజన్ `వాట్ ఉమెన్ వాంట్` షూటింగ్ లోనూ పాల్గొని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. గ‌ర్భిణి అయినంత మాత్రాన ప‌నికి ఆటంకం క‌ల‌గ‌కుండా వృత్తిని విడ‌వ‌కుండా క‌రీనా చేస్తున్న హార్డ్ వ‌ర్క్ యువ‌త‌రంలో స్ఫూర్తిని నింపుతోంది.
Tags:    

Similar News